మొగుడితో దగ్గరుండి రాత్రిపూట అలాంటివి చూపిస్తూ.. టార్చర్ చేస్తున్న హన్సిక‌ బాగా ముదిరి పోయిందిగా..!

టాలీవుడ్ లో 2007లో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ హన్సిక మోత్వాని. తొలి సినిమాకే హన్సికకు ఎక్కడలేని క్రేజ్ వచ్చి పడింది. అలాగే ఫస్ట్ సినిమానే హిట్ అవడంతో హన్సికకు ఆఫర్లు తెగ వచ్చాయి. ఇక ఈమె హీరోయిన్ కాకముందే బాలీవుడ్ లో కొన్ని సీరియల్స్ లో బాలనటి గా చేసిన అనుభవం ఉన్న హన్సిక కి నటన ఎంతో తొందరగా వచ్చేసింది.

అలా హన్సిక టాలీవుడ్ కోలీవుడ్ లో తనకు ఎవరూ ఎదురులేరు అనే విధంగా ఇండస్ట్రీలో రాణించింది. ఏదైనా కొద్ది రోజుల్లో అన్నట్లుగా ఈ హీరోయిన్ నటించిన కొన్ని సినిమాలు ప్లాప్ అవడంతో ఈమెను పట్టించుకునే దర్శక నిర్మాతలు ఎవరు లేకుండా పోయారు. దీంతో హన్సిక గత ఏడాది డిసెంబర్4న తన స్నేహితుడు వ్యాపారవేత్త ఆయన సోహైల్ కతూరియాను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత వీరి దాంపత్యం ఎంతో ఆనందంగా కొనసాగుతుంది.

అయితే గ‌త‌ కొన్ని రోజులుగా సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో హన్సిక పెళ్లి తర్వాత వెబ్ సిరీస్‌లో నటించడం మొదలుపెట్టింది. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన పెళ్లి జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇక హన్సిక ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా భర్త ఎంతో మంచివాడు నేను వివాహ బంధంలో ఎంతో ఆనందంగా ఉన్నాను అలాగే ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లో కూడా బిజీగా ఉన్నాను.

ఈ వెబ్ సిరీస్ లపై ఎంత పిచ్చి ఉందంటే ఒకసారి ఒక వెబ్ సిరీస్ కి ఒప్పుకుంటే రాత్రి అయినా సరే అది పూర్తి చేస్తున్నాను. అలాగే అందులో నటించడమే కాదు వెబ్ సిరీస్లను చూడడం కూడా ఎంతో ఇష్టం. ఇక రాత్రి ఎంత టైమ్ అయినా సరే నా హస్బెండ్ ని నాతో పాటు వెబ్ సిరీస్ చూడమని ఇబ్బంది పెడుతూ ఉంటాను..అంటూ హన్సిక ఆ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టింది. దీంతో ఈమె మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో హన్సికకు వెబ్ సిరీస్ అంటే అంత ఇష్టమా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.