ఓకే మన చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే చాలామంది స్టార్ హీరోయిన్లు ఓపెన్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ స్టార్ బ్యూటీ అను ఇమ్మానుయేల్ కూడా కాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన మజ్ను సినిమాతో ఈమె టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కు జంటగా అజ్ఞాతవాసి, అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హీరో కార్తీక్ జంటగా జపాన్ సినిమాలో నటిస్తుంది.
ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సమయంలోనే అను ఇమ్మానుయేల్ ఈ మూవీ ప్రమోషన్ లో పాల్గొని ఈ సందర్భంగా ఆమె క్యాస్టింగ్ కౌచ్‌పై మాట్లాడింది.. చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉంది.. పడకు సుఖం కోసం నన్ను కొందరు ఇబ్బంది పెట్టారు. కానీ నేను వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. తెలివిగా వారి నుంచి తప్పించుకున్నాను. అదేవిధంగా ఈ సమస్యను కుటుంబ సభ్యులు సహకారంతో మనం ఎదుర్కోవాలి. ఇలాంటి ఒత్తిడికి గురైనప్పుడు కుటుంబ సభ్యులతో చెప్పాలి వాళ్ళ అండ తీసుకోవాలని ఆమె చెప్పకు వచ్చింది.
ఇక ఆ తర్వాత అల్లు శిరీష్ తో ప్రేమ వ్యవహారం పై కూడా స్పందిస్తూ.. ఆ వార్తలు నా వరకు వచ్చాయి మా అమ్మగారు నాతో చెప్పారు. ఆమె న్యూస్ ఎక్కువగా ఫాలో అవుతారు. ఈ విధంగా తప్పుడు వార్తలు వస్తున్నాయని అమ్మ నాతో చెప్పి బాధపడింది. నిజానికి ఊర్వశివో రాక్షసివో సినిమాకి ముందు శిరీష్ ని కలిసిందే లేదు. ఆ సినిమా పూజా కార్యక్రమం జరిగిన రోజు పరిచయం అయ్యాడు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అను ఇమ్మాన్యూల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గాా మారాయి.