ఎన్టీఆర్ మాటే నా మాట అంటున బాలయ్య.. ఎవరు ఊహించని అప్డేట్..!

మన తెలుగు చిత్రపరిశ్రమలో నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ కుటుంబం ఎక్కడ ఉంటే సందడి అక్కడే ఉంటుంది. మరీ ముఖ్యంగా నట‌సింహం బాలకృష్ణ ఏ ఈవెంట్ కి వచ్చినా కూడా అంతా బాలయ్య గురించే మాట్లాడుకునేలా చేస్తారు. ఇక గత రాత్రి బాలకృష్ణ రామ్ పోతినేని, శ్రీ లీల జంటగా నటించిన స్కంద ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న విషయంం తెలిసిందే. ఈ ఈవెంట్ లో రామ్‌ను టీజ్‌ చేసిన బాలయ్య సినిమా గురించి బోయపాటి శ్రీను గురించి తనదైన శైలిలో మాట్లాడి అందరిని ఆ కొట్టుకున్నాడు.

అదేవిధంగా ఆ ఈవెంట్ చివర్లో బాలకృష్ణ నోటి వెంట జూ.ఎన్టీఆర్ మాట రావడం ప్రేక్షకులను ఎంతగానో ఆశ్చర్యపరిచింది.. అదేంటి బాబాయ్ నోటి నుంచి.. అబ్బాయి మాట ఏంటి..?.. ఎప్పుడు బాలకృష్ణ, ఎన్టీఆర్ గురించి ఎక్కడ మాట్లాడరు కదా.. అనుకుంటున్నారా.. అదేమీ కాదు నందమూరి కుటుంబంలో రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి, అన్న కూడా కారు ప్రమాదంలోనే చనిపోయారు. ఒక దాంతో హరికృష్ణ చనిపోయిన దగ్గర నుంచి ఎన్టీఆర్ ప్రతి ఈవెంట్ చివరిలో ప్రేక్షకులకు జాగ్రత్తలు చెబుతూ వస్తున్నాడు.

జాగ్రత్తగా వెళ్లాలని, హెల్మెట్ పెట్టుకోవాలని, నిదానంగా వాహనాలని నడపాలని, ఇంటి దగ్గర మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారని తనకు తన కుటుంబం ఎంతో అభిమానులు కూడా అంతే ముఖ్యమైని అభిమానులపై ఎనలేని ప్రేమను చూపిస్తూ వస్తున్నాడు. ఇక ఈ మాటలే ఆ ఈవెంట్ చివరిలో బాలయ్య నోట విన్నారు అభిమానులు. ఇక ఈ ఈవెంట్లో బాలయ్య మాట్లాడుతూ ఎంతో దూరం నుంచి వచ్చారు అభిమానులంతా కూడా.. నా అభిమానులు అయితే ఏంటి రామ్‌ అభిమానులు అయితే ఏంటి.. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా వాళ్లందరికీ కూడా థాంక్స్.

ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చినట్లు ఉన్నారు.. వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అక్కడ చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు మీకోసం.. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో నందమూరి అభిమానులు ఎన్టీఆర్ మాటనే తన మాటగా బాలయ్య‌ చెప్పడం ఎంతో ఆనందంగా ఉందని.. ఎన్టీఆర్ చెప్పిన మాటలను బాల‌య్య‌ చెప్పడం సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఎంతైనా బాబాయ్- అబ్బాయి అంతే అని ఫ్యాన్స్ కామెంట్లో పెడుతూ ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు.