త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ‘ దేవర ‘. కొరటాల శివ డైరెక్షన్లో భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల – ఎన్టీఆర్ డైరెక్షన్లో జనతా గ్యారేజ్ మూవీ వచ్చి సూపర్ హిట్ అయింది. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న రెండో సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్గా పరిచయం కాబోతుంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు రకాల న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ స్టైలిష్ అండ్ కూల్ లుక్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ఎన్టీఆర్ ని సూపర్ స్టైలిష్ గా ప్రిపేర్ చేసి ఓ మిర్రర్ పిక్ షేర్ చేశాడు.
ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చాలామందిని నెట్టిజన్స్ ఎన్టీఆర్ ఈ లుక్ దేవర సినిమాదే అని.. మరి కొంతమంది ఎన్టీఆర్ సినిమాలతో పాటు యాడ్లలో కూడా నటిస్తున్నాడు. అయితే ఈ సరికొత్త లుక్ యాడ్ కోసమా లేదా దేవర కోసమా ? అన్నది క్లారిటీ లేదు.