శోభ‌న్ బాబును అరెయ్ ఒరేయ్ అనే దాస‌రికి కృష్ణ‌తో ఎందుకు మాట‌ల్లేవ్‌.. ఏం జ‌రిగింది…!

తెలుగుసినిమాలో అగ్ర ద‌ర్శ‌కుడిగా పేరున్న దాస‌రి నారాయ‌ణ‌రావు.. చేతుల మీదుగా అనేక మంది ప‌రి చ‌యం అయ్యారు. ఇక‌, అప్ప‌టికే మంచి ఫామ్‌లో ఉన్న‌వారితోనూ దాస‌రికి మంచి అనుబంధం ఉంది. ఇదే.. వారిని వారి వారి కుటుంబాల‌కు సైతం చేరువ చేసింది. ఇక‌, స్వ‌తంత్రంగా దాస‌రి నారాయ‌ణ రావు వ్య‌వ‌హ‌రించేవారు. మోహ‌న్‌బాబు నుంచి శోభ‌న్‌బాబు వ‌ర‌కు దాస‌రి చాలా చ‌నువుగా ఉండేవారు.

Yesteryear Actor Bet On Mega Director | cinejosh.com

రాజ‌బాబు, ర‌మ‌ణారెడ్డి వంటివారితోనూ దాస‌రికి ప్ర‌త్యేక అనుబంధం ఉంది. వారిని అరెయ్‌.. ఒరేయ్‌.. అని కూడా అనేవారు. ముఖ్యంగా హీరోల‌ను ప్ర‌సాద్‌బాబు, శోభ‌న్‌బాబు వంటివారిని కూడా దాస‌రి అరెయ్ అనే పిలిచేవారు. అంత చ‌నువు ఉండేది. కానీ, ఎంత మందితో చ‌నువు ఉన్న‌ప్ప‌టికీ.. హీరో కృష్ణ విష‌యా నికి వ‌చ్చేస రికిమాత్రం .. దాస‌రికి కొన్ని లిమిట్స్ ఉండేవి. వాటిని ఆయ‌న తూచ‌. త‌ప్ప‌కుండా పాటించే వారు.

OSEY RAMULAMMA - ROADSHOW MIX - song and lyrics by DJ Naveen PRKT | Spotify

కృష్ణ‌తోనూ.. దాస‌రికి అనుబంధం ఉండేది. దాస‌రి తీసిన ఒసేయ్ రాముల‌మ్మ సినిమాలో కృష్ణ‌కు ప్ర‌త్యేక పాత్ర కూడా ఇచ్చారు. అంత‌కు ముందు.. కూడా దాస‌రితో కృష్ణ క‌లిసి న‌టించిన సినిమాలు.. ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హించారు. అయితే.. అల్లూరి సీతారామ‌రాజు సినిమా ద‌ర్శ‌కుడు సినిమా ప్రారంభ‌మైన కొన్నాళ్ల‌కే మృతి చెందారు. దీంతో సినిమా ఆగిపోయింది. దీనిని పూర్తి చేయాల‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌ని దాస‌రిని కోరారు. అయితే..ఆయ‌న ఒప్పుకోలేదు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య కొన్నాళ్లు మాట‌లు లేవు.

Osey Ramulamm Telugu Full Hd Movie Part -7 | Vijaya Shanti, Dasari narayana  Rao | Sithaara - YouTube

ఇక‌, అప్ప‌టి వ‌ర‌కు కృష్ణ‌తో చ‌నువుగా ఉన్న దాస‌రి నారాయ‌ణ‌రావు.. త‌ర్వాత త‌ర్వాత‌.. అరెయ్ అని పిల‌వ‌డం మానుకున్నారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న చెప్పుకొన్నారు కూడా. “నేను కృష్ణ‌ను కృష్ణ‌.. అరెయ్ ఒరెయ్ అని పిలిచేవాడిని. కానీ, అల్లూరి సీతారామ‌రాజు సినిమా చూసిన త‌ర్వాత‌.. గౌర‌వించాల‌ని అనుకున్నా. అందుకే కృష్ణ‌బాబు అని పిలవ‌డం ప్రారంభించాను“ అని దాస‌రి చెప్పుకొన్నారు.