మాములుగా స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి హీరోయిన్స్ రావడం చాలా అరుదు. కేవలం కొంతమంది మాత్రమే గ్లామర్ ఇండస్ట్రీలోకి ఎంకరేజ్ చేస్తారు. అయితే వారు ఏం చేసినా సరే ఆ ఎఫెక్ట్ ఆ స్టార్ మీద పడుతుంది. అలానే యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ ఫ్యామిలీ నుంచి ఇద్దరు తనయురాళ్లు హీరోయిన్స్ గా పరిచయం అయ్యారు. పెద్ద కూతురు శివాని కొంతమేరకు పర్వాలేదు కాని శివాత్మిక (Shivatmika) మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది.
గ్లామర్ ఫీల్డ్ లో నెగ్గుకు రావాలంటే గ్లామర్ గా కనిపించాల్సిందే అనే ఫార్ములా పట్టేసిన శివాత్మిక తన గ్లామర్ షోతో రెచ్చిపోతుంది. ఓ విధంగా అమ్మడు తన గ్లామర్ తో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. సినిమాల కన్నా సోషల్ మీడియాలో శివాత్మిక ఫోటో షూట్స్ కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం Shivatmika బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
స్టార్ తనయ ఈ రేంజ్ లో రెచ్చిపోవడం చూసి అందరు షాక్ అవుతున్నారు. స్టార్ హీరోయిన్ అవ్వాలంటే గ్లామర్ విషయంలో కూడా నో లిమిట్స్ అనేయాల్సిందే. అందుకే శివాత్మిక ముందునుంచే అలా ఫిక్స్ అయినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం శివాత్మిక కృష్ణవంశీ డైరక్షన్ లో వస్తున్న రంగమార్తాండ సినిమాలో నటిస్తుంది.