అందరు చూస్తుండగానే.. రణ్ వీర్ చెంప చెల్లుమనిపించిన బాడీగార్డ్..

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఇటీవల సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2022లో కనిపించారు. ఈ మూవీ ఫెస్టివల్ కి హాజరైన రణవీర్ కి ఓ చేదు అనుభవం ఎదురైంది.. ఈ ఈవెంట్ లో అతడి బాడీ గార్డ్ రణవీర్ సింగ్ చెంప చెల్లుమనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

అసలేేం జరిగిందంటే.. ప్రతిష్టాత్మక సైమా 2022 అవార్డ్స్ కార్యక్రమం శనివారం బెంగళూరులో నిర్వహించారు. ఈ షోలో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ మోసట్ పాపులర్ యాక్టర్ గా రణవీర్ సింగ్ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, పూజా హెగ్డె, విజయ్ దేవరకొండ, సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ తో సహా చాలా మంది స్టార్స్ పాల్గొన్నారు.

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఫంక్షన్ కి హాజరైన రణవీర్ సింగ్ ని చూడటానికి అభిమానులు ఎగబడ్డారు. ఆయనతో సెల్పీల కోసం క్యూ కట్టారు. రణవీర్ సింగ్ మాత్రం చాలా ఓపిగ్గా వారితో ఫొటోలు దిగేందుకు ప్రయత్నించారు. అయితే అభిమానులు మాత్రం మరింత ముందుకొచ్చి రణవీర్ ను లాగే ప్రయత్నం చేశారు. వారిని పక్కనే ఉన్న బాడీ గార్డ్స్ కంట్రోల్ చేస్తున్నారు. వారిని చేతులతో తోస్తూ, కొడుతూ అడ్డు తొలగిస్తున్నారు. ఈక్రమంలో ఒక బాడీగార్డ్ చేయి రణవీర్ సింగ్ చెంపకు గట్టిగా తగిలింది. దీంతో రణవీర్ షాక్ అయ్యాడు. దెబ్బ గట్టిగా తగలడంతో చెంప మీద చేయి పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కాసేపటి తర్వాత నవ్వుతూ, మిగిలిన అభిమానులతో సెల్ఫీలు దిగాడు. రణవీర్ సింగ్ ఈ స్టయిల్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

Tags: body guard, family, latest news, members, metting, Rajveer, ranveer, slaps