మమ్మల్ని హీనంగా చూసేవాళ్ళు అంటూ ఎమోషనల్ అయిన ఝాన్సీ..!

ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో తెలియదు. ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోతారు. జనాల్లో మంచి పేరుతో పాటు క్రేజ్ ను సంపాదిస్తారు. ఇంటర్వీలతో ఫుల్ బిజీ అవుతారు. ఇలా శ్రీదేవి డ్రామా కంపెనీలో పల్సర్ బండి పాటతో దుమ్ము దులిపేసిన కండెక్టర్ జాన్సీ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు తెలిగింట ప్రతి నోట ఆమె పేరే నడుస్తోంది. ఆమె ఇంటర్వ్యూలకు క్యూ కడుతున్నారు. అయితే ఇక్కడే ఆమె కష్టాల వెనుక ఉన్న కన్నీటి వ్యధ బయట పడింది.

ప్రతి ఇంటర్వ్యూలో గా ఆమె పడ్డ కష్టాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మరాయి… డాన్స్ చేసేందుకు పల్లెటూర్లకు వెళితే అక్కడి జనాలు హీనంగా చూసేవారని ఆవేదన వ్యక్తం చేసింది. డాన్స్ చేసేప్పుడు కనీసం డ్రస్సులు మార్చుకునేందుకు ఇళ్లలోకి కూడా రానిచ్చేవారు కాదని బాధ పడింది. తమను ఇళ్లలోకి రానివ్వడం వలన వారి పరువు పోతుందని.. కనీసం వాళ్ల ఇంటివైపు కూడా చూడనిచ్చేవారు కాదని కన్నీటి పర్యంతం అయ్యింది.

బట్టలు మార్చుకోవడానికి ఇంట్లోకి రానివ్వకపోవడంతో తామే ఒక ప్రత్యేకమైన టెంట్ రూముని ఏర్పాటు చేసుకొని స్టేజి వెనకాల డ్రెస్ మార్చుకునేవారమని చెప్పుకొచ్చింది. ఆ టెంట్ రూమ్ ని తాము ఎక్కడ కార్యక్రమం నిర్వహిస్తే అక్కడికి తీసుకు వెళ్లేవాళ్లమని తెలియజేసింది.

కొంతమంది డాన్సర్ లను అత్యంత హీనంగా చూస్తున్నారని. అలాంటివారి తీరుతో మిగిలన వారు కూడా తమను వారి ఇళ్లల్లోకి రానివ్వడంలేదని విచారం వ్యక్తం చేసింది. కనపడని కష్టాలనుండి బయటపడిన ఝాన్సీ ఇప్పుడు ఒక స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. ఆమెతో ఫోటోలు దిగేందుకు జనాలు క్యూ కడుతున్నారు. అయతే ఇప్పుడు కూడా ఆమెను ట్రోల్స్ చేసేవాళ్లు చేస్తూనే ఉన్నారు. ఆమె భర్తని కూడా ఇష్టానుసారంగా తిడుతూనే ఉన్నారు. అయినా వాటిని పట్టించుకోకుండా ఝాన్సీ ధైర్యంగా ముందుకు వెళుతుంది.

లోకులు కాకులన్న సామెతలు ఊరికే పుట్టలేదు ఏమో.. ముందు నడిచే వాడిని పడేయడం… ఎదిగేవాడిని తొక్కడం… బాగుపడేవానికి చెడగొట్టడం.. అనే పదాలు పెద్దలు అనుభవాలతోన్న సద్ది మూటలే. అయినా కష్టలాను దిగమింగి బతుకును ఉన్నత స్థానంలో నిలబెట్టుకునేందుకు ప్రయత్నించే వారికి సపోర్ట్ చేయాలే కాని కించపరిచేలా కామెంట్ లు చేయడం వారి విజ్ఞతకే వదిలేయా ఝాన్సీ అంటోంది. తనపై ఎన్ని నెగిటీవ్ కామెంట్ లు వచ్చినా పడ్డవాడే లేచి నిలబడతాడనే సమెలతా ఝాన్సీ ధృడంగా ముందుకు వెళ్లడం అభినందనీయం.

Tags: comments, Dancer jhansi, emotional, post, viral latest