అస‌లు వ‌రుణ్ తేజ్ – లావ‌ణ్య ప్రేమ‌కు మీడియేట‌ర్ ఆమేనా… అసలు నిజం తెలిసింది..!

నిన్న సాయంత్రం నుంచి తెలుగు మీడియా సర్కిల్స్ తో పాటు అటు జాతీయ మీడియాలోను ఇదే విషయం బాగా హైలెట్ అవుతుంది. బాలీవుడ్ మీడియా అయితే కోడై కూస్తోంది. టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లికి రెడీ అవుతున్నారు. వచ్చే నెలలోనే వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరగబోతుంది. ఇక వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ పెళ్లి కబుర్లు జనాలకు కొత్త కాదు. డిసెంబర్ 31 టైంలో కూడా ఇలాంటి వార్తలు చాలానే వచ్చాయి.

Niharika and Varun Tej share about their bond on Raksha Bandhan | Telugu Movie News - Times of India

వరుణ్ ఖరీదైన ఉంగరం కొన్నాడని.. బెంగళూరు వెళ్లి మరి లావణ్య కు ప్రపోజ్ చేస్తున్నాడంటూ కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై లావణ్య స్పందించింది. ప్రస్తుతం తాను ఉత్తరాఖండ్లో ఉన్నాను అంటూ పరోక్షంగా ఆ వార్తను ఖండించేందుకు ప్రయత్నాలు చేసింది. అయితే గత కొన్ని రోజులుగా వీరిద్ద‌రు డేటింగ్ లో ఉన్నారన్న గుసగుసలు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Varun Tej's Prospective Bride At Niharika Wedding? | cinejosh.com

వీరిద్దరూ కలిసి రెండు సినిమాలలో జంటగా నటించారు. ఇక వరుణ్ తేజ్ చెల్లి నిహారిక పెళ్లి రాజస్థాన్లో జరిగినప్పుడు లావణ్య చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అయితే వీరిద్దరూ సినిమాలలో నటిస్తున్నప్పుడు ప్రేమలో పడటం కంటే.. అంతకు ముందు నుంచి వీరిద్దరి ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. నిహారిక – లావణ్య మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి ఒకే జిమ్ కు వెళ్లేవారట.

చెల్లి నిహారిక ద్వారా లావణ్య వరుణ్ తేజ్ కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి రెండు సినిమాలలో నటించారు. ఈ క్రమంలోని ఇద్దరు ప్రేమలో పడినట్టు వార్తలు వచ్చాయి. అలా లావణ్య త్రిపాఠి – వరుణ్ ప్రేమ మధ్య నిహారిక పెద్ద మీడియేటర్ గా వ్యవహరించిందట. ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటికి వచ్చింది. మొత్తానికి నిహారిక మామూలు అమ్మాయి కాదు.. తన అన్నకి హీరోయిన్ సెట్ చేయడంలో బాగానే కోఆపరేట్ చేసింది అనుకోవాలి.