కీర్తి సురేష్‌కు కాబోయే మొగుడు ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చేశాయ్‌… క‌త్తి లాంటి కుర్రోడ్ని ప‌ట్టేసింది…!

కీర్తి సురేష్ చాలా తక్కువ టైంలోనే పాపులర్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. తెలుగులో వచ్చిన మహానటి సినిమాతో జాతీయస్థాయిలో ఒకసారిగా పాపులర్ అయిపోయింది. దివంగత మహానటి సావిత్రి బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో కీర్తి సురేష్ చేసిన నటన అద్భుతం.. అమోఘం అని చెప్పాలి. కీర్తి సురేష్ అమ్మ మేనక ఒకప్పటి నటి. మెగాస్టార్ చిరంజీవితో కూడా ఎన్నో సినిమాలలో నటించారు. నాన్న సురేష్ నిర్మాత. సినిమాల్లోకి వచ్చి ఒక నటిగా ప్రూవ్ చేసుకునేందుకు కీర్తికి అంతకు మించిన అర్హతలు ఏం ?కావాలి.

చాలా తక్కువ సమయంలోనే ఉత్తమ జాతీయ నటి అవార్డు గెలుచుకున్నారు కీర్తి. తెలుగుతోపాటు తమిళం – మలయాళం లోను చాలా సినిమాలలో నటించారు. మహానటి సినిమా అయితే ఆమె కెరీర్ను తీసుకువెళ్లి శిఖరాగ్రాన కూర్చోబెట్టింది. మహానటి తర్వాత కొన్ని సినిమాలలో గ్లామర్ పాత్రలు పోషించిన కీర్తి మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో మంచి రొమాంటిక్ యాంగిల్ కూడా చూపించింది.

 

ఇటీవల వచ్చిన నాని దసరా సినిమాలో డి గ్లామర్ హీరోయిన్ గా నటించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి చెల్లిగా భోళాశంకర్ సినిమాలో నటిస్తున్నారు. త‌మిళంలో ఐదారు సినిమాల్లో కీర్తి నటిస్తోంది. జయం రవి – ఉదయ‌నిధి స్టాలిన్ లాంటి హీరోలకు జోడిగా నటిస్తోంది. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు అవుతున్నాయి. 30 ఏళ్ల ఈ పరువాల బ్యూటీ ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుందన్న‌ ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

Keerthi Suresh

కీర్తి ఒక వ్యక్తితో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతుంది. ఆ వ్యక్తితోనే షికార్లు కూడా చేస్తోంది. అతని పేరు పర్హానీ బీన్ లియాకత్ అని తెలుస్తోంది. అతడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అని సమాచారం. ఇటీవల అతడి పుట్టిన రోజు సందర్భంగా కీర్తి సురేష్ అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ కూడా చేసింది. ఇక వీరు ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. చూడ‌డానికి అత‌డు ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్‌లా ఉన్నాడు. దీంతో సోషల్ మీడియాలోనూ కీర్తికి కాబోయే భర్త అతడే అయి ఉంటాడన్న ప్రచారం అయితే బాగా జరుగుతుంది.