ఏంటీ.. సీనియర్ ఎన్టీఆర్ కి కూడా ఆ శాపం తప్పలేదా..? ఎవ్వరికి తెలియని ఇంట్రెస్టింగ్ స్టోరి ఇదే..!!

స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాటితరం నుంచి నేటితరం అలాగే భవిష్యత్తు తరాలు కూడా గుర్తుపెట్టుకునే ఏకైక వ్యక్తి ఆయన.. అంతలా తన నటనతో రాజకీయ ప్రస్థానంతో ఎన్నో చెరగని రికార్డులను సృష్టించిన నందమూరి తారక రామారావు గారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆ తర్వాత తన జీవితాన్ని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచేలా చేశారు. ఇకపోతే సీనియర్ ఎన్టీఆర్ గారు మన మధ్య లేకపోయినా సరే ఆయన చేసిన మంచి పనులే ఆయనను చరిత్ర ఉన్నంతవరకు బ్రతికిస్తాయి అనడంలో సందేహం లేదు.

Sr.NTR : సీనియర్ ఎన్టీఆర్ గాఢంగా ప్రేమించిన ఇద్దరు హీరోయిన్లు ఎవరో  తెలుసా..? - PakkaFilmy

ఇకపోతే నందమూరి కుటుంబానికి ఒక శాపం ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆ కుటుంబంలో చాలామంది యాక్సిడెంట్ కి గురయ్యారు. అందులో కొంతమంది ఏకంగా ప్రాణాలనే కోల్పోయారు అయితే ఈ యాక్సిడెంట్ అనేది ఎన్టీఆర్ తరం నుంచే మొదలయ్యింది అనేది సన్నిహితుల వాదన.. ఈ యాక్సిడెంట్ లో హరికృష్ణ ను మొదలుకొని జానకి రామ్ ను మొదలుకొని ఎన్టీఆర్ కొడుకులలో కొంతమంది యాక్సిడెంట్ కి గురై మరణించిన విషయం తెలిసిందే. అయితే వీరందరి కంటే ముందు సీనియర్ ఎన్టీఆర్ కూడా చాలా సార్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారట.

ఇక ఈ విషయం తెలిసి అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మరి ముఖ్యంగా సినిమాలలో తీసే అడ్వెంచర్స్ ఫైటింగ్ వల్ల, రోడ్డు ప్రమాదాల వల్ల ఆయన కుడి చేయి ఏకంగా నాలుగు సార్లు విరిగింది అని.. అందుకే కుడి చేయి పట్టుతప్పడంతో ఎడమ చేతితోనే ఆయన దీవెనలు అందించేవారు అంటూ వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఏది ఏమైనా ఎన్టీఆర్ కుటుంబానికి యాక్సిడెంట్ అనే ఒక శాపం ఇంకా వెంటాడుతూనే ఉందని చెప్పవచ్చు.