Sharwanand : శర్వానంద్ సినిమాకి పాజిటివ్ టాక్..!

యువ హీరో శర్వానంద్ కొన్నాళ్లుగా వరుస ఫ్లాప్ సినిమాలు చేస్తున్నాడు. తను కథ నచ్చి చేసినా ఎక్కడో ఒక చోట తేడా కొట్టేయడంతో వరుస పరాజయాలు అందుకున్నాడు. అయితే Sharwanand లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మోర్నింగ్ షో నుంచి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. టైం ట్రావెల్ కథతో వచ్చిన ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ కూడా ఉంది.

ఆల్రెడీ స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా మంచి టాక్ తెచ్చుకోగా ఈరోజు మార్నింగ్ షోస్ నుంచి కూడా సూపర్ హిట్ టాక్ అందుకుంది. యూఎస్ ప్రీమియర్స్ నుంచి కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. సో మొత్తానికి శర్వానంద్ నిరీక్షణ ఈ సినిమాతో ఫలించిందని చెప్పొచ్చు. ఒకే ఒక జీవితం తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది.

ఈ సినిమాలో Sharwanand సరసన రీతు వర్మ నటించింది. వెన్నెల కిశోర్, ప్రియదర్శి కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. సినిమాలో ముఖ్యంగా అమల అక్కినేని పాత్ర మెప్పిస్తుందని తెలుస్తుంది. మదర్ అండ్ సన్ గా అమల్, శర్వానంద్ హృదయాలను కదిలిస్తారని తెలుస్తుంది.

Tags: Oke Oke Jeevitam, OOJ, Priyadarshi, Reetu Varma, Sharwanand, Sri Karthik, vennela kishor