ఆరెక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) ఆ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి హాట్ ఫెవరేట్ అయినా ఆ తర్వాత అమ్మడు ఆ స్థాయిలో హిట్ అందుకోలేదు. వరుస సినిమాలైతే చేస్తున్నా కానీ పాయల్ కి రావాల్సిన గుర్తింపు రాలేదని చెప్పొచ్చు. అయితే బాలీవుడ్ లో సీరియల్స్ చేస్తున్న పాయల్ కి తెలుగులో లక్కీ ఛాన్స్ ఇచ్చాడు అజయ్ భూపతి. అయితే ఆ సినిమా హిట్ అయ్యాక తన మేనేజర్లు వల్ల కొన్ని సినిమాలు చేయాల్సి వచ్చిందని రీసెంట్ గా ఇంటర్వ్యూలో చెప్పింది పాయల్.
అంతేకాదు కథ వినకుండానే అడ్వాన్స్ తీసుకునే వారని.. అడ్వాన్స్ తీసుకున్న కారణంగా కొన్ని సినిమాలు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. తన సినీ కెరియర్ లో తనకు తెలియకుండా ముగ్గురు మేనేజర్లు తనని దారుణంగా మోసం చేశారని అంటుంది పాయల్. ఒకరు ఇద్దరు కాదు ముగ్గురు మేనేజర్లు తనని మోసం చేశారని చెప్పారు పాయల్.
ఇక ప్రస్తుతం తన కాల్ షీట్స్ తానే చూసుకుంటున్నానని.. కథ నచ్చితేనే సినిమాలు చేస్తున్నానని.. ఆరెక్స్ 100 లాంటి సినిమా ఒకటి పడితే మాత్రం అమ్మడికి మళ్లీ క్రేజీ ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. Payal Rajput కెరియర్ మళ్లీ స్వింగ్ లో రావాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.