ఆ హీరోయిన్ల‌తో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి : హీరో శ‌ర్వానంద్‌

నిత్యామీన‌న్‌, సాయిప‌ల్ల‌వి, స‌మంత‌ల‌తో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హీరో శ‌ర్వానంద్ అన్నారు. ఇప్పుడు ఈ విష‌యం టాలివుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స‌మంత‌, శ‌ర్వానంద్ జంట‌గా త‌హిళ హిట్ సినిమా 96 రీమెక్ జానులో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాను దిలిరాజు నిర్మిస్తుండ‌గా మాతృక సినిమాకు ధ‌ర్వ‌క‌త్వం వ‌హించిన ప్రేమ్‌కుమార్ తెలుగులోనూ తెర‌కెక్కిస్తున్నారు. సినిమాకు సంగీతం గోవింద్ వసంత అందించారు. ఈ సినిమా ఈనెల 7వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది. అందులో భాగంగా శనివారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హీరో నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన శర్వానంద్ ప‌లు ఆసక్తికరమైన విషయాల‌ను అభిమానులతో షేర్ చేసున్నారు. ‘జానీ’ సినిమా అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంద‌ని తెలిపారు. నిత్యామీనన్, సాయి పల్లవి, సమంత లాంటి హీరోయిన్లతో సినిమా చేసేప్పుడు కొంచెం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని న‌ట‌న‌లో వాళ్లను దాటలేక‌పోయినా, వాళ్లతో సమానంగా నటించాల్సి ఉంటుంద‌ని తెలిపారు. సమంత సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ఆమె త‌న‌ ప్రతి సినిమాను ఫస్ట్ సినిమాగానే భావిస్తుంటార‌ని, అందుకే ఆమె సూపర్ స్టార్ అయ్యార‌ని వివ‌రించారు. త‌న‌ను చూసి ఎన్నో నేర్చుకున్నాన‌ని పంచుకున్నారు. ఇక సినిమా గురించి చెప్పాలంటే వందలో తొంభై మందికి లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయ‌ని, అందులోనూ పదో క్లాస్‌లో 99 పర్శంట్ ఉంటాయ‌ని అలాంటి వారంద‌రికీ సినిమా క‌నెక్ట్ అవుతుంద‌ని తెలిపారు.

Tags: Nani, nitya menon, saipallavi, Samantha, sharwanadh