చంద్ర‌బాబు.. లోకేష్‌పై ఆంధ్ర యూనివ‌ర్సీటీ వీసీ ఫైర్‌

తాము ఒక‌టి త‌లిస్తే దైవం మ‌రొక‌టి త‌లిచింద‌న్న‌ట్లు ఉన్న‌ది టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయ‌కుడు, ఆయ‌న కుమారు నారా లోకేష్ ప‌రిస్థితి. విప‌క్షాన్ని ఇర‌కాటంలో ప‌డేయాల‌ని ఎత్తులు వేస్తే తిరిగి వారే చిత్త‌వుతున్నారు. ఇంత‌కీ విష‌య‌మేమిటంటే మెస్ చార్జీలు, ఫీజుల పెంపున‌కు వ్య‌తిరేకంగా ఆంధ్ర‌యూనివ‌ర్సిటీ విద్యార్థులు కొద్దికాలంగా ధ‌ర్నాలు చేస్తున్నారు. యూనివ‌ర్సిటీలో ఆందోళ‌న‌ను చేస్తున్నారు. ఆ ధ‌ర్నాల‌కు టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న‌యుడు మాజీ మంత్రి లోకేష్ ఇటీవ‌లె మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాడు. దీనిపై ఏయూ వీసీ ప్ర‌సాద్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. బాబు, లోకేష్‌పై మండిప‌డ్డారు. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

విద్యార్థుల‌తో ధ‌ర్నాలు చేయిస్తూ, వారి భ‌విష్య‌త్‌ను నాశ‌నం చేస్తున్నార‌ని చంద్ర‌బాబు, లోకేష్‌పై ఫైర్ అయ్యారు. వారి కారణంగానే విద్యార్థులకు రోడ్ల మీదకు రావాల్సి దుస్థితి నెల‌కొంద‌ని తెలిపారు. ఎన్నికలకు మూడు నెలల ముందు ఏయూ నిధులను భారీగా దుర్వినియోగం చేశారని, బ్లాక్ గ్రాంట్స్ ఇవ్వకుండా ఇంటర్నల్ గ్రాంట్స్ ను కూడా అడ్డగోలుగా వాడుకున్నారని ఆరోపించారు. ఏయూ నిధుల‌ను సుమారు వందకోట్ల వ‌ర‌కు పసుపు కుంకుమకు మ‌ళ్లించార‌ని ధ్వ‌జ‌మెత్తారు. జ్ఞానభేరి కోసం రూ. 4 కోట్లను దారి మళ్లించార‌ని, ఏయూ నిధులతో ఎన్నికల ప్రచారం నిర్వహించార‌ని ప్రసాద్ రెడ్డి ఆరోపించ‌డం సంచ‌ల‌నం రేపుతున్న‌ది. విద్యార్థులు భవిష్యత్తుతో చెలగాటం ఆడటం సరికాదని, విద్యార్థులను రెచ్చగొట్టి ఏయూ ప్రతిష్టను దిగజార్జ‌వ‌ద్ద‌ని హిత‌వుప‌లికారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించదానికి తాము సిద్ధమ‌ని ప్ర‌క‌టించారు.

Tags: andhra university vc prasadreddy, chandrababu naidu, lokesh