షారుక్ మూవీకి ఏకంగా 250 ఆడవాళ్లతో భారీ యాక్షన్ సీక్వెన్స్..

బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ తో తమిళ దర్శకుడు అట్లీ ‘జవాన్’ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ చిత్రం ఇప్పటికే నిర్మాణంలో ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. త్వరలోనూ ఈ సినిమాకు సంబంధించి ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ చెన్నైలో చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్ సీన్ ని చిత్రీకరించడానికి భారీ సెట్ నిర్మించారట. అంతేకాదు.. 200 నుంచి 250 మంది మహిళలతో ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తారని ప్రచారం జరుగుతోంది.. అందుకోసం ముంబై నుంచి 250 మంది ఆడవాళ్లను తీసుకురానున్నారట.. ఈ యాక్షన్ సీన్స్ ని దాదాపు ఏడు రోజుల పాటు చిత్రీకరించనున్నారట. అయితే ఈ షూటింగ్ కి సంబంధించి అధికారిక ప్రకటన అయితే చిత్రం యూనిట్ విడుదల చేయలేదు..

‘జవాన్’ ఒక యూనివర్సల్ స్టోరీ అని, ఇలాంటి యూనిక్ చిత్రాన్ని రూపొందిస్తున్నందుకు క్రెడిట్ అంతా అట్లీకే దక్కుతుందని షారుక్ ఖాన్ తెలిపారు. అట్లీ లాంటి డైరెక్టర్ తో పనిచేయడం ఓ గొప్ప అనుభూతని అన్నారు. తాను లవ్ యాక్షన్ మూవీస్ ని బాగా ఇష్టపడతానని, ఇటీవలే వచ్చిన టీజర్ శాంపుల్ మాత్రమే అని షారుక్ చెప్పుకొచ్చారు..

ఇక ఈ సినిమాతో నయనతార బాలీవుడ్ లో అడుగుపట్టడం విశేషం.. తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ ఓ కామియో రోల్ చేయనున్నట్లు టాక్. నటులు రానా, సాన్య మల్హోత్రా, సునీల్ గోవర్, సైతం కీలక పాత్ర పోషించనున్నారట. అట్లీ దర్శకత్వం వహిస్తున్న జవాన్ ను గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టుకు ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహ్మాన్, అనిరుధ్ రవిచందర్ పనిచేస్తున్నారని సమాచారం. ఈ సినిమాను జూన్ 2, 2023న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ గురించి పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది..

Tags: 250 actress, movie, movies, new delhi, Sharukhan, updated 25/