బ్రహ్మాస్త్రం కలెక్షన్లు ఫేక్.. మరోసారి ఫైర్ అయిన వివాస్పద హీరోయిన్..!

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎప్పుడూ ముందు ఉంటుంది. తనకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఎప్పుడూ మీడియాలో నానుతూ ఉంటుంది. కాగా..రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా బ్రహ్మాస్త్రం అనే సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫలితంపై కొద్దిరోజుల కిందట కంగనారనౌత్ స్పందించిన విషయం తెలిసిందే. బ్రహ్మాస్త్రం సినిమాను తెరకెక్కించిన అయాన్ ముఖర్జీ ఈ సినిమా కోసం ఖర్చు పెట్టిన ఆరు వందల కోట్లను బూడిదలో పోసిన పన్నీరు చేశాడని విమర్శించింది.

తాజాగా మరోసారి ఈ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కంగనారనౌత్. బ్రహ్మాస్త్రం సినిమా కు మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. కానీ కలెక్షన్లు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కలెక్షన్లు ఫేక్ అని కంగనా రనౌత్ తేల్చింది. బ్రహ్మాస్త్రం సినిమా ఇప్పటివరకు రూ. 144 వేల కోట్ల నెట్, 240 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు.. ఈ మూవీ ఇంకా బ్రేక్ ఈవెన్ కావాలంటే మొత్తం రూ.650 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాలని ఒక ప్రముఖ వెబ్ సైట్ లో కథనం ప్రచురితం కాగా.. దాన్ని కంగనా రనౌత్ షేర్ చేశారు.

బ్రహ్మాస్త్రం సినిమా కేవలం రూ. 144 కోట్లు రాబడితే ఇది బ్లాక్ బాస్టర్ హిట్ అని కొంతమంది ప్రచారం చేసుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. సినిమా మాఫియా కావాలనే ఈ సినిమా ఎక్కువగా కలెక్షన్లు వసూలు చేస్తోందని చెబుతూ సూపర్ హిట్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.ఒక సినిమాకు వస్తున్న కలెక్షన్లు, రికవరీ తో సంబంధం లేకుండా ఆ చిత్రం హిట్ అని ఎలా చెబుతారని ఆమె మండిపడ్డారు.

ఏ సినిమా విజయం సాధిస్తుందో.. ఏది ప్లాప్ అవుతుందో కూడా సినీ మాఫియా పెద్దలే నిర్ణయిస్తున్నారని మండిపడ్డారు. కొందరి సినిమాలకు హైప్ పెంచడం, కొందరి సినిమాలను బహిష్కరించడం కూడా వాళ్ళ చేతుల్లోనే ఉందని కంగనా విమర్శించారు. ఈ సినిమా విజయవంతమైందని ప్రచారం చేస్తూ సినీ మాఫియా పెద్దలు మరోసారి తమ అసలు రంగును బయట పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. బ్రహ్మాస్త్రం సినిమా కలెక్షన్లు ఫేక్ అని ప్రకటించి కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు.

Tags: bollywood cinimas, bollywood collections, bramastram, kanagana ranaut, nagarjuna