చేతులారా కెరీర్ నాశనం చేసుకున్న అమలాపాల్..

సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో అమలాపాల్ ఒకరు.. తక్కువ సమయంలోనే తన అందం, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అనేక హిట్ సినిమాల్లో నటించింది. అమలాపాల్ తెలుగులో కొన్ని చిత్రాల్లో మాత్రమే నటించింది. బెజవాడ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన అమ్మడు.. తర్వాత నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో నటించలేదు. అయితే తమిళంలో ఆమె నటించిన ప్రతి సినిమా తెలుగులో అనువాదం అవుతోంది..

అయితే అమలాపాల్ మాత్రం కెరీర్ లో దూసుకుపోతున్న సమయంలో పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. ప్రముఖ దర్శకుడు ఏఎల్ విజయ్ కుమార్ ని అమలాపాల్ ప్రేమించి 2014లో పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి చేసుకున్న మూడేళ్లకే అమలాపాల్ విడాకులు తీసుకుంది. ఈ విడాకుల వెనుక నటి అమలాపాల్ మాజీ ప్రియుడి హస్తం ఉందని అప్పట్లో పలు కథనాలు వచ్చాయి. కానీ అమలాపాల్ తన మాట వినకుండా సినిమాలు చేసేందుకు విడాకులు కావాలని కోరడం వల్లే విడిపోయామని అప్పట్లో విజయ్ చెప్పారు. ఆ తర్వాత అమలాపాల్ మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చింది..

ఇటీవల తన మాజీ ప్రియుడు పవీందర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీసులను కూడా ఆశ్రయించింది.. ఇలా ఏదో ఒక వివాదంతో అమలాపాల్ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ప్రేక్షకుల్లో కూడా అమలాపాల్ విషయంలో పాజిటివ్ ఇంప్రెషన్ ఉండేది.. కానీ రానురాను అమలాపాల్ పై నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతోంది.. అమలాపాల్ కూడా చాలా వరకు సినిమాలను తగ్గించేసింది. వెబ్ సిరీస్ లను ఎంచుకోవడంలోనూ అమలాపాల్ పొరపాట్లు చేస్తోంది.. ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల అమలాపాల్ హీరోయిన్ గా వెనుకబడిపోతుంది.. ప్రస్తుతానికి ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటూ, వెకేషన్స్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది.. అమలాపాల్ సినిమా విషయాల కంటే ఆమె ప్రేమ, పెళ్లి విషయాల గురించి ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది..

Tags: actress, Amala Paul, highlight, latest news, losses, movies, Tollywood, viral