Sharukh Khan : జవాన్ నాన్ థియేట్రికల్ రైట్స్ లెక్కలివే.. బాలీవుడ్ బాద్షా స్టామినా ఇది..!

Sharukh Khan Jawan Non Theatrical Rights Bang

Sharukh Khan : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ స్టార్ డైరక్టర్ అట్లీ డైరక్షన్ లో వస్తున్న సినిమా జవాన్. షారుఖ్ ఏరి కోరి మరీ అట్లీతో కలిసి ఈ మూవీ చేస్తున్నాడు. దళపతి విజయ్ తో వరుస హిట్లు కొట్టిన అట్లీ షారుఖ్ తో చేస్తున్న జవాన్ తో కూడా భారీ రేంజ్ లో వస్తున్నాడు. కొన్నాళ్లుగా షారుఖ్ ఖాన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు ఇవ్వట్లేదు. అందుకే ఈసారి సౌత్ దర్శకుల మీద నమ్మకం పెట్టాడు షారుఖ్.

ఇక ఈ జవాన్ సినిమా మీద పోస్టర్స్ నుంచే అంచనాలు పెంచేస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటుగా సినిమా నుంచి వచ్చిన టీజర్ కూడా ఇంప్రెస్ చేసింది. ఇక ఈ సినిమా బిజినెస్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. జవాన్ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ లోనే దుమ్ము దులిపేస్తుందని తెలుస్తుంది.

జవాన్ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ తోనే 250 కోట్ల దాకా రాబట్టిందని తెలుస్తుంది. ప్రముఖ డిజిటల్ సంస్థ జవాన్ సినిమాను కొనేసిందని తెలుస్తుంది. షారుఖ్ ఖాన్ సొంతంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. జవాన్ సినిమాను హిందీలోనే కాదు తమిళ, తెలుగు భాషల్లో కూడా భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 2023 సెకండ్ హాఫ్ లో ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేశారు.

Tags: Atlee, Gauri Khan, Jawan, Jawan Business, Jawan movie, Sharukh Khan