Rashmika : స్లీవ్ లెస్ మెరుపులతో శ్రీవల్లి.. వాళ్లకి నిద్రపట్టకుండా చేస్తున్న రష్మిక..!

Rashmika at Mumbai Roads Glamour Attack Media

Rashmika : కన్నడ భామ రష్మిక మందన్న క్రేజ్ బాలీవుడ్ కి పాకేసింది. పుష్ప పార్ట్ 1 లో శ్రీవల్లి పాత్రలో అమ్మడి అభినయానికి అక్కడ ఫ్యాన్స్ ఏర్పాడ్డారు. దానితో పాటుగా రష్మిక అక్కడ రెండు భారీ ప్రాజెక్ట్ లు చేస్తుంది. ఈ రెండు సినిమాలతో హిందీ లో కూడా పాగా వేయాలని చూస్తుంది అమ్మడు. ఇప్పటికే రష్మిక నటించిన గుడ్ బై మూవీ ట్రైలర్ తో రష్మిక నటనకు అక్కడ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

ఇక ఈమధ్య తరచు ముంబైలో దర్శనమిస్తున్న రష్మిక అక్కడ మీడియాకి నిద్ర పట్టకుండా చేస్తుంది. ముఖ్యంగా అమ్మడి గ్లామర్ షో కోసం ముంబై మీడియా కెమెరా క్లిక్ అనిపించేందుకు ఎలర్ట్ గా ఉంది. ఒక్క సినిమా హిందీలో రిలీజ్ అవకుండానే రష్మిక ఇలా రెచ్చిపోతుంది అంటే ఒకవేల అక్కడ సినిమాలు రిలీజై హిట్ అయితే మాత్రం రష్మిక రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.

లేటెస్ట్ గా రష్మిక ముంబైలో కనబడగా అక్కడ రోడ్డు మీదే ఆమెని ఫోటో తీసేందుకు మీడియా వాళ్లు అత్యుత్సాహం చూపించారు. ఓ విధంగా అమ్మడు మీడియా కంట కనబడితే చాలు ఓ పట్టానా వదిలి పెట్టేలా లేరు. అమ్మడు కూడా తనకు వస్తున్న ఈ క్రేజీ పబ్లిసిటీని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది.

Tags: Mumbai Media, Rashmika, Rashmika Glamour, Rashmika Mandanna, Rashmika Mumbai