టీడీపీ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పినట్టు… తెలుగు దేశం పార్టీ వ్యవస్థా పక అధ్యక్షుడు ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని పెంచేందుకు కృషి చేసి సక్సెస్ అయితే, ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలుగు వారిలో ఆత్మ విశ్వాసం పెంచేందుకు శతవిధాల ప్రయత్నించా రనడంలోనూ, దానిని సాధించారని చెప్పడంలోనూ ఎలాంటి సందేహం లేదు. అందుకే చంద్రబాబు అంటే .. పొలిటికల్‌గానే కాకుండా.. అభివృద్ధి, విజన్ వంటి కీలక అంశాలకు ఒక `బ్రాండ్`గా మారారు.
ఉమ్మడి ఏపీ నుంచి విభజిత రాష్ట్రం వరకే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు పేరుకు ఒక ట్రేడ్ మార్కు ఉందనడంలోనూ ఎలాంటి అతిశయోక్తి లేదు. అటు వంటి నాయకుడిపై నేడు అక్రమా లు, అవినీతి ముద్ర వేయడం అంటే.. దుస్సాహసమే అవుతుందని ప్రపంచ స్థాయిలో వ్యక్తమవుతున్న ఏకాభిప్రాయం. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం.. ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నాడు ఉమ్మడి ఏపీ పాలకుడిగా ఉన్నప్పుడే.. చంద్రబాబు ఏదైనా చేసి ఉండాలి. కానీ, అప్పట్లోనే ఆయన నిప్పు మాదిరిగా పాలించారు. అంతేకాదు.. `తాను తినడు, ఇతరులను తిననివ్వడు`- అని సొంత పార్టీలో నే ఒక దశలో తీవ్ర విప్లవం వచ్చిందంటే.. అది చంద్రబాబు నిజాయితీకి మచ్చుతునక. నిజానికి 9 సంవ త్సరాలు.. వనరులు అధికంగా ఉన్న ఉమ్మడి ఏపీని పాలించిన నాడే చంద్రబాబు చేతికి మట్టి అంటకుండా.. నిజాయితీగా వ్యవహరించారని అప్పటి విపక్ష నాయకులే సర్టిఫికెట్లు సమర్పించిన పరిస్థితి అందరికీ తెలిసిందే.
అలాంటి నాయకుడు, పిండి బెల్లం వదిలేసి పిడకల గూటికి ఆశపడే అవకాశం ఉందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే.. ఏమాత్రం అవినీతికి పాల్పడాలన్నా… ఉమ్మడి ఏపీలోనే ఆయన సంపాయిం చుకునేవారు. కానీ, అలా చేయలేదే. బాబు తర్వాత.. 10 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆరోపణలు చేసినా.. ఒక్కటైనా నిరూపించలేకపోయిన వైనం.. నాడే కాదు.. నేడు కూడా.. చంద్రబాబు రాజకీయ కౌశలతకు, నిజాయితీకి మెచ్చుతునక.
కాగా, నేడు వైసీపీ సర్కారు చంద్రబాబు భుజంపై ఓ అవినీతి ముద్ర వేసి.. ప్రజల మధ్య ఆయనను దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించే యత్నం.. నిస్పందేహంగా మసిపూసి మారేడు చేసిన చందమే అవుతుందని అంటున్నారు పరిశీలకులు. విజ్ఞత, విధేయతలకు చంద్రబాబు చిరునామా అయితే, నిజాయితీ, జవాబు దారీ తనానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. సో.. చంద్రబాబుపై ఇప్పుడు పడింది ఆరోపణల మకిలే తప్ప.. మచ్చలు కాదనడంలోనూ.. ఏనాటికీ కాబోవనడంలోనూ సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు. అందుకే.. చంద్రబాబు నాడు… నేడు.. ఏనాడూ.. ప్రజలకు ఒక నియమ,నిష్టలున్న నాయకుడిగానే గోచరిస్తున్నారు తప్ప.. మరొకటి కాదని చెబుతున్నారు.