జగన్ వీరభక్తుడు అయినా వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికలలో జనసేన – టిడిపి కూటమి సంచలన విజయం సాధించబోతుందని ఆయన జోస్యం చెప్పారు. అలాగే 1999 ఎన్నికల నుంచి ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ? తాను చెప్పిన జోష్యం ప్రతిసారి నిజం అవుతున్నాయి అంటూ ఆయన లెక్కలతో సహా చెప్పారు.
తాను 1999 టీడిపి వస్తుంది అనీ ప్పాను.. అలాగే 2004 లో కాంగ్రెస్ గెలుస్తుందన్నాను.. 2009 లో ప్రజారాజ్యం వలన మనం గెలుస్తున్నం అనీ రాజశేఖర్ రెడ్డికీ చెప్పాను.. 2014 లో సజ్జలకీ టీడిపి వస్తుంది అనీ చెప్పాను.. 2017 నంద్యాల ఉపఎన్నికలో టీడిపి 30000 మెజారిటీ తో గెలుస్తుందని జగన్ తో చెప్పితే… జగన్ 5000 మెజార్టీతో మనమే గేలుస్తున్నం అని చెప్పాడు.. ఇక 2019 లో 130 పైన స్థానాలలో గేలుస్తున్నామ్ అని జగన్ కీ చెప్పానని ఆయన తెలిపారు.
ఇక ఇప్పుడు 2024 లో జనసేన టీడిపి కూటమి 160 స్థానాల్లో గెలుస్తుంది..57% ఓటింగ్ శాతం వస్తుంది రాసి పెట్టుకోండి అని కోటంరెడ్డి తేల్చిచెప్పారు. ఏదేమైనా కోటంరెడ్డి గతంలో చెప్పిన అన్ని జోస్యాలు నిజం అయ్యాయి. మరి ఆయన చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోబోతోందని క్లారిటీ వచ్చేసింది.
అంటే గత ఎన్నికల్లో తెలుగుదేశంకు వచ్చిన 23 సీట్లు కూడా వైసీపీకి రావని క్లియర్‌గా తేలిపోయింది. అంటే వైసీపీ వాళ్లు కేవలం 15 సీట్లకు పరిమితం అయ్యేలా ఉన్నారు. ఇది జగన్‌కు ఘోర పరాభవం లాంటిదే అని చెప్పాలి.