దిల్ రాజుకు చుక్క‌లు చూపిస్తోన్న శంక‌ర్‌… ఇద్ద‌రి మ‌ధ్య చెడిందా..?

టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్‌తో మూవీ అంటే ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్ప‌క‌ర్లేదు. ఆయన స్టోరీలో కంటెంట్‌తో పాటు సాంగ్స్‌కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. మూవీలో ఒక్క పాటకు అయ్యే ఖర్చుతో దాదాపు మ‌ధ్యత‌ర‌హా సినిమాలు 2, 3 తీసేయొచ్చు అని టాక్ వినిపిస్తుంది. శంకర్ గుర్తుండేలా పాటల కోసమే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడట.

కాగా ఇప్పుడు చ‌రణ్‌తో పాటు కమల్ హాసన్ సినిమాల్లో కూడా ఇదే చేస్తున్నాడు శంకర్. రామ్ చరణ్ గేమ్ చేంజర్‌ సినిమాలో 5 పాటల కోసం మొత్తం రూ.90 కోట్లు ఖర్చు చేయిస్తున్నట్లు తెలుస్తుంది. ఒక్కోపాటుతో ఏకంగా రూ.15 కోట్లు ఖర్చు పెట్టించాలని చూస్తున్నాడట. ఇక సినిమాకు దిల్ రాజు నిర్మతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

దిల్ రాజు బడ్జెట్ నీ చాలా కంట్రోల్ గా మేనేజ్ చేస్తూ ఉంటాడు. కానీ శంకర్ పాటలకే ఇంత డబ్బులు ఖర్చు చేయించాలని చూడడంతో వీరిద్దరి మధ్యన ఈ విషయంపై ఏవో గొడవలు జరిగాయని అందుకే షూటింగ్ కూడా ఆలస్యం అవుతుందని స‌మాచారం. ప్రస్తుతం ఇదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.