అల్లు అర్జున్ ఎవ‌రో నాకు తెలియ‌దు..?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సొంతంగా త‌నకంటూ ఒక ఇమేజ్‌ను ఏర్ప‌ర‌చుకున్నారు. టాలివుడ్‌లోనే కాక అటు మాలివుడ్‌, కొలివుడ్‌లోనూ అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఆయ‌న సినిమా విడుద‌ల‌వుతుందంటే దేశ‌విదేశాల్లో సంద‌డి నెల‌కొంటుంది. ఇటీవ‌లే అల‌వైకుంఠ పురంలో.. సినిమాతో మంచి హిట్టును అందుకున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌నెవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని అనేసి అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది ఒక‌ప్ప‌టి శృంగార చిత్రాల తార‌. కానీ ఇది బ‌న్నీ అభిమానుల‌కు తెగ ఆగ్ర‌హం తెప్పించింది. ఈ టాపిక్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

శృంగార తార ష‌కీలా గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. త‌న సినిమాల‌తో కాక పుట్టించేంది. స్టార్ హీరోల‌తో స‌మానంగా పారితోషికాని్న అందుకున్న చ‌రిత్ర ఆమెది. ఆమె సినిమాల విడుద‌ల స‌మ‌యంలో దిగ్గ‌జ న‌టులు కూడా త‌మ చిత్రాల‌ను విడుద‌ల చేసేందుకు కొంచెం జంకేవారు. అయితే గ‌త కొద్దికాలంగా ఆమె సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు. ఇటీవ‌లే ఆమె ప్రధానపాత్రను పోషిస్తూ విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా 24 క్రాఫ్ట్స్ బ్యానర్‌పై సీవీ రెడ్డి సమర్పణలో సి.హెచ్ వెంకట్ రెడ్డి నిర్మాణ సార‌థ్యంలో, సాయిరాం దాసరి దర్శకత్వంలో సతీష్ వీఎన్ ‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథాచిత్రం’ అనే మూవిని తెర‌కెక్కింది. ఆ మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ఓ యూట్యూబ్ చాన‌ల్‌కు ష‌కీలా ఇంట‌ర్వ్యూను ఇచ్చింది.

ఈ సంద‌ర్భంగా ప‌లు విష‌యాల గురించి మాట్లాడింది. త‌న న‌ట జీవితంలో ఎదురైన అనుభ‌వాల‌ను, ఎద‌ర్కొన్న స‌వాళ్ల‌ను, చిత్ర‌సీమ‌లో చ‌విచూసిన చేదు అనుభ‌వాల‌ను వివ‌రించింది. అలాటే టాలివుడ్ న‌టుల‌కు సంబంధించి కూడా అనేక విష‌యాల‌ను తెలిపింది. ఈ సంద‌ర్భంగా స్టైలీష్ స్టార్ బ‌న్నీ గురించి అడ‌గ‌గా ఆయ‌నెవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పేసి అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. ఇప్ప‌డు ష‌కీలా చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి. టాలివుడ్లో దుమారం రేపుతున్నాయి. బ‌న్నీ అభిమానుల్లో ఆగ్ర‌హాన్ని తెప్పిస్తున్నాయి.

Tags: allu arjun, nenu rasina kutumba katha citram, shakila