చంద్ర‌బాబు పీఏ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఆయ‌న‌తో ప‌నిచేసిన అధికారుల‌కు కూడా క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. ఇప్ప‌టికే గ‌త ప్ర‌భుత్వంలో ఉన్న‌త స్థాయిలో విధుల‌ను నిర్వ‌ర్తించిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులైన సాయిప్ర‌సాద్‌, రాజ‌మౌళిలు, మ‌రికొంత మంది అధికారుల‌కు వైసీపీ ప్ర‌భుత్వం నేటికీ పోస్టింగ్‌ల‌ను ఇవ్వ‌లేదు. ఒక్క స‌తీశ్‌చంద్రను త‌ప్ప మిగ‌తా అధికారులంద‌రినీ వెయింటింగ్‌లో పెట్టింది. ఇదిలా ఉండ‌గా తాజాగా చంద్ర‌బాబు వ‌ద్ద పీఏగా చేసిన అధికారి శ్రీ‌నివాస్ ఇంటిపై ఏసీబీ దాడులు చేయ‌డం సంచ‌ల‌నం రేపుతున్న‌ది.

ప్ర‌కాశం జిల్లాకు చెందిన శ్రీ‌నివాస్ సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ (జీఏడీ)లో ఉద్యోగి. ఆయ‌న చంద్ర‌బాబుకు న‌మ్మిన‌బంటు. ఉమ్మ‌డి ఏపీలో రెండో సారి ముఖ్య‌మంత్రిగా చేప‌ట్టిన స‌మ‌యం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు వ‌ద్ద ఆయ‌న పీఏగా ప‌నిచేస్తున్నారు. ఈ క్ర‌మంలో భారీగానే ఆస్తులు కూడ‌బెట్టార‌నే ఆరోఫ‌ణ‌లున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఏక‌కాలంలో విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్‌ల్లోని ఆయ‌న నివాసాల‌పై అధికారులు దాడులు చేశారు. సోదాల‌ను నిర్వ‌హిస్తుండ‌డం సంచ‌ల‌నంగా మారింది. రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్న‌ది.

Tags: anti currpyion buer, chandrababu pa srinivas, prakasham