పాయె, కియా కూడా పాయె…!

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రముఖ కంపెనీల్లో కియా ఒకటి. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో ఏర్పాటైన ఈ కంపెనీ దేశానికే గర్వకారణంగా నిలిచింది. ఎన్నో రాష్ట్రాలు పోటీ పడినా సరే అప్పటి చంద్రబాబు సర్కార్ విధానాలతో రాష్ట్రంలో కియా పరిశ్రమను ఏర్పాటు చేసారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం తన రాష్ట్రానికి కియా పరిశ్రమను తీసుకువెళ్ళేందుకు గాను గట్టిగా ప్రయత్నాలు చేసారు. అయినా సరే చంద్రబాబు పట్టుదలగా అన్ని రాష్ట్రాల కంటే మీరుగా కంపెనీనికి రాయితీలు ఇచ్చి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వ విధానాలు ఆ కంపెనీకి తీవ్ర ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. వేల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి సంస్థను ఇక్కడ నెలకొల్పితే వాళ్ళు మాకు ఇదేం ఖర్మ రా బాబు అంటూ తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. రాజకీయంగా ఉన్న అక్కసుతో జగన్ సర్కార్ కియాను కూడా ఇబ్బంది పెట్టడంతో చిన్న చిన్న కంపెనీలు కర్నాటకకు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏకంగా కియా కూడా వెళ్ళిపోవడానికి అన్ని విధాలుగా సిద్దమైంది. దీనిపై రాయిటర్స్ అనే అంతర్జాతీయ మీడియా సంచలన కథనం రాసింది.ఆ కధనం నిజం అనేలా జాతీయ మీడియాలో కూడా రావడం ఆదోళన కలిగించే విషయం .

ఏపీ ప్రభుత్వ విధానాలు నచ్చక కియా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్దమైందని, 1.1 బిలియన్ పెట్టుబడి పెట్టిన ఆ సంస్థ తమిళనాడు సర్కార్ తో చర్చలు జరుపుతుందని త్వరలోనే వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. దీనితో ఇప్పుడు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కియా లాంటి కంపెనీ రావాలనుకున్న రాయలసీమ వాసులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కథనంపై ఏపీ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కియా తో కలిసి పని చేస్తున్నామని చెప్పింది. ఆ కథనం తప్పు అని రజిత్ భార్గవ అనే ఏపీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు.అయితే ఈ కధనం పై కియా యాజమాన్యం స్పదించే వరకు ఎదురు చూడాల్సిందే .

Tags: AP, KIA Motors, Shifting, Speculation, TamilaNadu, YS Jagan