సౌతిండియాలో ఒకప్పుడు మార్మోగిపోయిన పేరు. దిగ్గజ నటులతో సమానంగా పారితోషికంగా తీసుకున్న నటి. మెగా సినిమాలకు సైతం పోటినిచ్చిన స్టార్. ఆమె షకీలా. అనేక శృంగార భరిత చిత్రాలతో ఆడియాన్స్‌లో హిటెక్కించిన ఆమె చాలా కాలంగా సినిమాలకు దూరమయ్యారు. ఇటీవలే సంపూర్ణేష్ బాబు చిత్రం కొబ్బరిమట్టతో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆమె ఈ మధ్య సెన్సర్ బోర్డంటేనే మండిపడుతున్నది. వారిపై నిప్పులు చెరుగుతున్నది. ఎందుకంతా కోపం? ఏమిటా కారణం? వారితో ఆమెకు ఎందుకు వైరం? పట్టలేని ఆగ్రహం. అని అందరూ చర్చించుకుంటున్నారు. వాటిని ఆమె స్వయంగా వెల్లడించింది.
షకీల ప్రధానపాత్రలో విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా 24 క్రాఫ్ట్స్ బ్యానర్‌పై సీవీ రెడ్డి సమర్పణలో సి.హెచ్ వెంకట్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో, సాయిరాం దాసరి దర్శకత్వంలో సతీష్ వీఎన్ ‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథాచిత్రం’ అనే మూవిని తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా నటి షకీలా మాట్లాడుతూ తన మనసులోని ఆవేదననంతా బయటపెట్టారు. తాన నిర్మించిన ‘లేడీస్ నాట్ అలౌడ్’ సినిమాకు పది నెలలుగా సెన్సార్ ఇవ్వడం లేదని, ఎందుకో తనకు అర్థం కావడం లేదని, అంతకంటే వల్గారిటీతో వచ్చిన సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయని వాపోయారు. కేవలం తన సినిమాకే సెన్సార్ వాళ్లు అభ్యంతరాలు చెబుతున్నారని మండపడ్డారు.
ఇదిలా ఉండగా.. షకీలా అంటే వల్గారిటీ సినిమాలేనా.. ఫ్యామిలీ సినిమాలు చేయదా? అనే విమర్శలన్నాయని, తాను అన్ని రకాల సినిమాలు చేయగలనని నిరూపించడం కోసమే నేను రాసిన కథ సినిమా చేశానని వివరించారు. ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతారోనని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పడు షకీలా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. టాలివుడ్లో దుమారం రేపుతున్నాయి. సినీవర్గాల్లో కొత్త చర్చలు దారితీస్తున్నాయి.