ఏపీలో అధికార, విపక్ష నేతల మధ్యల పరస్పర విమర్శలు వెల్లువెత్తున్నాయి. విపక్ష నేతల కాంమెట్లకు అధికార పకక్ష నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కన్నా ఏపీలో ఉన్న టీడీపీ, దాని అనుకూల ఎల్లో మీడియా పత్రికలు చాలా డేంజరస్ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ నేత, మంత్రి కొడాలి నాని. తాడేపల్లిలో పర్యటించిన ఆయన పట్టణంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై చేస్తున్న విమర్శలను తిప్పకొట్టారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలను తూర్పార పట్టారు.
అమ్మ ఒడి పథకం ద్వారా 44 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరిందని, అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో కోటిమందికిపైగా ప్రజలకు లబ్ధి చేకూరిందని కొనియాడారు. అయినప్పటికీ ప్రభుత్వ పథకాలపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తుంటే, ఏపీలో ఈ ఎల్లో మీడియా విషపు రాతలతో విజృంభిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో 39 లక్షల మందికి ఇచ్చే పెన్షన్లను.. ప్రస్తుతం జగన్ 54 లక్షలకు పెంచారని గుర్తుచేశారు. అదీగాక ఇంటింటికే వెళ్లే నగదును అందజేస్తున్నారని తెలిపారు.
వీటిని చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగే నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని.. బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని పరోక్షంగా జనసేనపై కూడా కొడాలి నాని మండిపడ్డారు. ఏపీని లూటీ చేసిన వ్యక్తి జేసీ దివాకర్ రెడ్డిపై ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు బూట్లు నాకి 500 ఎకరాల సున్నపు క్వారీలను తీసుకున్నారని, పర్మిట్లు కట్టకుండా దివాకర్ ట్రావెల్స్ బస్సులు నడిపారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా జేసీ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని మంత్రి హితవు పలికారు. దీనిపై ఆ నేతలు ఎలా స్పందిస్తార చూడాలి.