ఇటీవలే సంపాదనలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్. గంటలో రూ. 94వేల కోట్లను ఆర్జిస్తూ రికార్డు సృష్టించాడు. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అయితే తాజాగా ఓ కేసులో ఇరుక్కుని మరోసారి వార్తలకు ఎక్కాడు ఈ ధనవంతుడు. పరువు నష్టం దావాలో చిక్కుకున్నారు. అదీ తన ప్రేయసి సోదరుడు మూలంగా. ఇంతకీ ఆ కేసేమిటి? ఎందుకు వేశాడు అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం మీరే చదివేయండి.
2019 జనవరిలో ది నేషనల్ ఎంక్వైరర్ అనే పత్రిక జెఫ్ బెజోస్, ఆయన ప్రేయసి లారెన్ శాంచెజ్బ వ్యక్తిగత ఫొటోలను, కొన్ని సంభాషణలను బయటపెట్టింది. లారెన్ శాంచెజ్ నగ్న ఫోటోలతో పాటు జెఫ్ బెజోస్‌తో ఆమె శృంగారంలో పాల్గొన్న ఫోటోలు కూడా ఉన్నాయి. అవి అప్పట్లో దుమారం లేపాయి. ఆ ఫోటోలు బయటపడడంతో బెజోస్ భార్య మెకంజీ షాక్‌కు గురయ్యారు. తీవ్ర మనస్తాపానికి గురై బెజోస్‌కు ఏకంగా విడాకులు కూడా ఇచ్చారు. ఈ ఫోటలో లీకేజీ వెనక తన ప్రేయసి లారెన్ సోదరు మైఖలో ఉన్నాడని బెజోస్ ఆరోపించాడు. వాటికి బలం చేకూర్చే విధంగా పరుస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనం ప్రచురించింది. లారెన్ శాంచెజ్ సెల్‌ఫోన్ నుంచే మైకెల్‌కు ఫోటోలు,మెసేజ్‌లు వెళ్లాయని, ఆ సమాచారాన్ని మైఖెల్ 2లక్షల డాలర్లకు ది నేషనల్ ఎంక్వైరర్‌కు అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి.
ఇదిలా ఉండగా బెజోస్ చేసిన ఆరోపణలతో ఎఫ్‌బీఐ తన ఇంటిని సోదా చేశారని, సామాజంలో తన ప్రతిష్టకు భంగం కలిగిందని లారెన్ సోదరుడు మైకెల్ వాపోయాడు. ది నేషనల్ ఎంక్వైరర్ అనే పత్రికకు వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసినట్టు జెఫ్ చేసిన ఆరోపణలు నిరాధారమని పేర్కొంటూ ఆయనపై పరువు నష్టం దావా వేశాడు. తన సోదరి లారెన్ శాంచెజ్‌కు తాను విధేయుడైన సోదరుడిగా, మేనేజర్‌గా వ్యవహరించానని, ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా మైకెల్ పిటిషన్ బెజోస్ ప్రేయసి లారెన్ శాంచెజ్ స్పందిస్తూ.. తన సోదరుడివి నిరాధార,నిజం లేని ఆరోపణలు అని కొట్టిపడేయం గమనార్హం. జెఫ్ బెజోస్ మాత్రం ఇప్పటికైతే ఏ విధంగానూ స్పందించలేదు. ఇటీవలే బెజోస్ శాంచెజ్‌లు భారత పర్యటనకు వచ్చి తాజ్‌మహల్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే.