ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో బాలివుడ్‌ నటి వ్యభిచార దందా..

దేశ ఆర్థిక రాజధానిలోని ఓ ఐదు నక్షత్రాల హోటల్‌లో ఓ బాలివుడ్‌ నటి గుట్టుగా సాగిస్తున్న వ్యభిచార దందాను పోలీసులు చాకచక్యంగా రట్టు చేశారు. సెక్స్‌ రాకెట్‌ నిర్వాహకులను, యువతులను సరఫరా చేస్తున్న వారిని అరెస్టు చేశారు. అయితే ఈ దందాలో ఓ బాలివుడ్‌ నటి కూడా ముఖ్యపాత్ర పోషించడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. ముంబై గోరెగావ్‌లోని ప్లస్‌స్టార్‌ ఫైల్‌స్టార్‌ హోటల్‌లో సెక్స్‌ దందా కొనసాగుతున్నదని ముంబై పోలీసులు సీనియర్‌ ఉన్నతాధికారి దిండోషికి ఒక అపరిచిత వ్యక్తి సమాచారాన్ని అందించాడు. దీంతో రంగంలోకి దిగిన ఆయన సంబంధిత విషయం ఆరా తీశారు. హోటల్‌లో సెక్స్‌రాకెట్‌ జరుగుతున్నదని ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. అనంతరం నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు పక్కా ప్రణాళికను రూపొందించారు. అందులో భాగంగా సాధారణ విటుడి మాదిరిగా ఓ పోలీసు అధికారి సదరు హోటల్‌కు వెళ్లాడు. సెక్స్‌ రాకెట్‌ నిర్వాహకుడిని సంప్రదించాడు. బేరం కుదుర్చుకున్నాడు. దీంతో యువతులతో హోటల్‌కు వచ్చిన సదరు వ్యభిచార దందా నిర్వాహకుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

 

ఇదిలా ఉండగా సదరు వ్యభిచార దందాకు యువతులను సరఫరా చేస్తున్నది  బాలివుడ్‌  నటి అమృతధనోవా కావడం సంచలనం రేపుతున్నది. నటి అమృత దనోవా రెండు మూడు బాలివుడ్‌ సినిమాల్లో మెరిసినా అంతగా ప్రాచుర్యంలోకి రాలేకపోయింది. అయితే హిందీలో వివాదస్పద బిగ్‌బాస్‌ కాంటెస్ట్‌తో ఆమె ఒక్కసారిగా అందరి దృష్టిలో పడింది. అలాని ఆమె అందులో కాంటెస్ట్‌ చేయలేదు. మరేలాగంటే బిగ్‌బాస్‌ 13 షోలో కాంటెస్ట్‌ చేసిన అర్హాన్‌ఖాన్‌ ప్రియురాలినని చెప్పుకొచ్చిన ఈ అమ్మడు అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ షో సమయంలోనే  అర్హాన్‌ఖాన్‌ మంచివాడు కాదని, రూ.5లక్షలు తీసుకుని తనను మోసం చేశాడని ఆరోపించి మీడియాలో రచ్చకెక్కింది. దీంతో పాపులారిటీ సంపాదించింది. ఇప్పుడు ఇన్నాళ్లకు సెక్స్‌ రాకెట్‌కు యువతులను సరఫరా చేస్తూ పట్టుబడి మళ్లీ వెలుగులోకి వచ్చింది. నటి అమృత ధనోవాతోపాటు యువతులను సరఫరా చేస్తున్న మోడల్‌ రిచాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరిపై యువతుల అక్రమ రవాణా కేసులను నమోదు చేశారు.

Tags: BOLLYWOOD ACTOR, FIVE STAR HOTEL, SEX ROCKET IN MUMBAI