ఎమ్మెస్ నారాయ‌ణ పిచ్చ తాగుబోతుగా మార‌డానికి ఆ స్టార్ న‌టుడే కార‌ణ‌మా…!

మెగా కుటుంబం నుంచి ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. చిరంజీవి తర్వాత నటవారసత్వాన్ని పునికి పుచ్చుకొని నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇలా ఎందరో హీరోలు టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. అయితే వారిలో నాగబాబు మొదట కొన్ని సినిమాల్లో హీరోగా చేసినా ఆ తర్వాత నిర్మాతగా మరి కొన్ని సినిమాలను నిర్మించారు. అలాంటి నాగబాబు వల్ల ఓ స్టార్ కమెడియన్ తాగుబోతుగా మారిపోయాడు.

Dhana Dhan M. S. Narayana Comedy - Comedy Kings - Naga Babu - YouTube

నాగబాబు వల్ల తాగుబోతుగా మారిన ఆ స్టార్ కమిడియన్ ఎవరో ఇప్పుడు చూద్దాం. చిత్ర పరిశ్రమలో హీరో, హీరోయిన్లకు ఎంత మంచి గుర్తింపు ఉంటుందో అలాగే విలన్స్ కి, కమెడియన్సుకి కూడా అంతే మంచి గుర్తింపు ఉంటుంది. మన తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు రామలింగయ్య, రేలంగి వంటి ఎందరో స్టార్ కమెడియన్స్ తర్వాత మళ్లీ అంతటి గుర్తింపు తెచ్చుకుంది బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ.

ఎమ్మెస్ నారాయణ అలా స్టార్ కమెడియన్‌గా ఉన్నా సమయంలోనే ఒకే సంవత్సరంలో దాదాపు 40 సినిమాల్లో నటించారంటే అప్పట్లో కమెడియన్‌గా ఆయన క్రేజ్ ఎలా ఉండేదో తెలుస్తోంది. ఆయ‌న తన చివరి శ్వాస వరకు కూడా సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. ఎమ్మెస్ ఎక్కువగా తాగుబోతు పాత్రల‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన మొదటిసారి తాగుబోతు పాత్రలో నటించింది మాత్రం నాగబాబు హీరోగా వచ్చిన రుక్మిణి సినిమాలో..! ఈ సినిమాలో ఎమ్మెస్ నాగబాబుకి అసిస్టెంట్ గా తాగుబోతు పాత్రలో నటిస్తాడు.

ఆ పాత్ర త‌న‌కు సెట్ అవుతుందో లేదో అని ఎమ్మెస్ చాలా భయపడే వారట. కానీ నాగబాబు మాత్రం పట్టుబట్టి మరి ఆ పాత్రకు మీరే కరెక్ట్ గా సెట్ అవుతారని ఆయనతో చేయించారట. దాంతో ఆ సినిమాలో ఎమ్మెస్ నారాయణ పాత్రకి మంచి గుర్తింపుపు వచ్చింది. చాలా సినిమాల్లో ఎమ్మెస్ నారాయణ తాగుబోతు పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఎమ్మెస్ నారాయణ మొదటిసారిగా తాగుబోతుగా నటించిన సినిమా కూడా ఇదే.

నేను అప్పటి వరకు తాగుబోతు పాత్రలు చెయ్యలేదు, నన్ను ప్రోత్సహిస్తూ ఆ పాత్రని అలవోకగా చేసేందుకు నాగబాబు ఎంతో సపోర్టు ఇచ్చాడు. ఆయన వల్లే నేను తాగుబోతు పాత్రలను అలవాటు చేసుకున్నాను అంటూ గ‌తంలో ఎన్నో సార్లు అయ‌న చెప్పుకోచ్చారు. నేను తాగినప్పుడు మాట్లాడే యాస ప్రేక్షకుల చేత నవ్వు తెప్పించేది.. అందుకే డైరెక్టర్స్ ఎక్కువగా నాకు ఆ పాత్రలు రాసార‌ని చెప్పుకొచ్చాడు ఎమ్మెస్ నారాయణ. ఆయన కేవలం కమెడియన్ మాత్రమే కాదు, ఒక గొప్ప రచయితా మరియు దర్శకుడు కూడా..!