ఒంటరిగా వస్తే ఎక్కువ డబ్బులిస్తామన్నారు.. గీతు రాయల్‌కు అలాంటి ఆఫ‌ర్ ఇచ్చిందెవ‌రు..!

పుష్ప సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి గీతూ రాయల్.. ఇలా వచ్చిన పాపులారిటీతోనే.. ఇటీవ‌ల కాలంలో బుల్లితెర మీద తెగ సందడి చేస్తూనే ఉంది. ఈ పాపులారిటీతోనే ఈమెకి బిగ్ బాస్ లోకి అవకాశం రావడం జరిగింది. అయినా విన్నర్ కాలేకపోయింది గీతూ రాయల్.. చిత్తూరు యాసతో అదరగొట్టేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

Geetu Royal Height, Age, Husband, Family, Biography & More » StarsUnfolded

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గీతూ రాయల్ తనకి టాలీవుడ్ లో ఇష్టమైన హీరో అల్లు అర్జున్ అని తెలియజేసింది.. తనకి ఎవరితోనైనా సరే ఎక్కువగా మాట్లాడడం ఇష్టమని తెలిపింది. బడా బ్యానర్లలో సినిమా అవకాశాలు వచ్చాయి కానీ తనకు పెద్దగా యాక్టింగ్ రాదని నో చెప్పేసిందట. ఆ తర్వాత మహేష్ విట్టా తో కల్ట్ గ్యాంగ్, సోహైల్ తో లక్కీ లక్ష్మణ్ మూవీలో చిన్న పాత్రలలో నటించానని తెలిపింది. అలాగే క్యాస్టింగ్ కౌచ్ పైన మాట్లాడుతూ.. ఇటీవల తనకు ఒక చేదు అనుభవం కూడా ఎదురైందని తెలిపింది గీతూ రాయల్.

Geetu Royal Wiki, Biography, Age, Real Name, Family, Movies List,  Relationship, Bigg Boss Telugu 6 And More - BBTV

ఆస్ట్రేలియాలో ఒక ఈవెంట్ ఉందని అందుకు హోస్ట్ గా చేయమని అడిగారని.. అందుకు తనకు కూడా ఇష్టం ఉండడంతో హోస్టింగ్ కి ఓకే చెప్పానని తెలిపింది.. ముఖ్యంగా ఆస్ట్రేలియా అంటే అక్కడ షాపింగ్ చేయొచ్చు పైగా మూడు రోజులు ఈవెంట్ భారీ రెమ్యూనరేషన్ వస్తుంది అని సరేనని చెప్పానని తెలిపింది.. అయితే టికెట్ బుక్ చేసే సమయంలో మేనేజర్ పిఏ తనకు పర్సనల్గా ఓకే అయితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తామని ఫోన్ చేశారని దీంతో ఒక్కసారిగా తన మైండ్ బ్లాక్ అయిందని తెలిపింది గీతూ రాయల్.

Beauty is all about being confident... - Galatta Geetu Royal | Facebook

అయితే ఆ తర్వాత వెంటనే నో చెప్పానని దీంతో తను పర్సనల్ గా కాకపోయినా హోస్టింగ్ అయినా చేయండి అని చాలాసార్లు తనని ఫోన్ చేసి అడగడం జరిగిందట. కానీ తనకి భయం వేసి అసలు రానని చెప్పేసానని తెలిపింది గీతూ రాయల్.. ఇక అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఎలాంటి వాటినైనా చేసేటప్పుడు ఆలోచించి చేయాలని తగిన నిర్ణయాన్ని తీసుకున్నానని తెలిపింది గీతూ రాయల్.