కమెడియన్ అలీ హీరోగా… హీరో విక్రమ్‌ విలన్ గా నటించిన తెలుగు సినిమా తెలుసా..!

చిత్ర పరిశ్రమకు ఎలాంటి బ్యాగ్రౌండ్, సపోర్ట్ లేకుండా వచ్చి స్టార్ హీరోలుగా, స్టార్ కమెడియన్లుగా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. అలా స్టార్ హీరోలుగా మారిన వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి గురించి ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ గురించి వీరిద్దరూ కూడా ఇటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అగ్ర హీరోలుగా మారారు.

Ooha (1996) - IMDb

వీరి తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్‌ కూడా ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోగా మారాడు. విక్రమ్‌ తన కెరీర్ ప్రారంభంలో తమిళ సినిమాలతో పాటుగా పలు తెలుగు సినిమాల్లో కూడా నటించాడు. ఇక వాటిలో కొన్ని సినిమాల్లో విలన్ గా, మరికొన్ని సినిమాల్లో కమెడియన్ గా నటించాడు.

OOHA Telugu Full Movie - YouTube

విక్రమ్‌ తన కెరీర్ మొదట్లో అక్కినేని నాగేశ్వరరావు తో కూడా కలిసి నటించాడు ఇక ఆ సినిమా ‘బంగారు కుటుంబం’.. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. అప్పట్లో శ్రీకాంత్ సతీమణి ఊహతో కూడా తెలుగులో పలు సినిమాల్లో నటించాడు విక్రమ్. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘ఊహ’.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్పుకోవాలి..ఈ సినిమాలో విక్రమ్ విలన్ పాత్రలో కనిపిస్తాడు.. ఈ సినిమాను శివాల ప్రభాకర్ అనే దర్శకుడు తెరకెక్కించాడు.

Comedian Ali: Not to join YCP, no clarity on future plan

కమెడియన్ ఆలీ హీరోగా నటించాడు. విక్రమ్ ఈ సినిమాలో విలన్‌గా తన న‌ట విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత విక్రమ్ ప‌లు తెలుగు సినిమాల్లో నటించినా అవి అంతగా సక్సెస్ అవ్వలేదు. తమిళంలో కాశీ అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమాతో ఏకంగా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నాడు. ఆ సినిమా ద‌గ్గ‌ర నుంచి విక్రమ్ వరుస సినిమాల్లో నటిస్తూ సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోగా గుర్తుకు తెచ్చుకున్నాడు.