” చిన్నాగా ఉన్నాయి పెద్దగా చేసుకోమన్నారు “.. సంయుక్తా మీనన్‌ని అలా టార్చర్ చేసారా..?

సంయుక్త మీనన్.. భీమ్లా నాయక్ సినిమాతో రానా భార్యగా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. సంయుక్త ఈ సినిమాల్లో చిన్న పాత్రలోనే నటించినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసార‌ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ రావడంతో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది సంయుక్త. తరువాత సార్, విరూపాక్ష వంటి సూపర్ హిట్ సినిమాల్లో కూడా నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సంయుక్త తెలుగులో నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఆమె గోల్డెన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

Introducing Samyuktha Menon as 'Vyjayanthi' in Bimbisara | Nandamuri Kalyan  Ram | In theatres Aug5th - YouTube

ఇక అసలు విషయానికి వస్తే.. సంయుక్త ఇటీవల నటించిన విరూపాక్ష సినిమా తెలుగుతోపాటు హింది, తమిళ్, మలయాళ భాషల్లోనూ రిలీజ్ సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌, ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొన్న సంయుక్త ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు అందర్నీ ఆశ్చర్యపరిచేలా సమాధానాలు ఇచ్చింది.

Mastaaru Mastaaru': First single from Dhanush, Samyuktha Menon's 'SIR' out  | Telugu Movie News - Times of India

తాను ఇప్పటికీ 20 సినిమాలలో నటించానని.. అయినప్పటికీ ప్రతి సినిమాకి ముందు స్క్రీన్ టెస్ట్ లో పాల్గొనేదాన్ని.. ఆ స్క్రీన్ టెస్ట్ లో వారు అడిగిన అన్ని యాంగిల్స్‌లో నటించేదాన్న‌ని చెప్పింది. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంతమంది నా కళ్ళు చాలా చిన్నవిగా ఉన్నాయి అంటూ విమర్శించారని.. కళ్ళు కాస్త పెద్దగా ఉంటే బాగుండేది అంటూ వంకలు పెట్టే వారిని వాపోయింది.

SVCC comes down for Samyuktha Menon

ప్రస్తుతం ఆ కళ్ళతోనే తాను హావభావాలను పలికించి విరూపాక్ష సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాను… నా కళ్ళు బాగుంటాయ‌ని ఇప్పుడు చాలామంది అవే కళ్ళను మెచ్చుకుంటున్నారంటూ సంయుక్త ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే ఈ న్యూస్ విన్న చాలామంది సంయుక్త ఫ్యాన్స్ సంయుక్తను కేవలం కళ్ళు చిన్నగా ఉన్నాయని విషయంపై అంతగా టార్చర్ చేశారా..? అంటూ విమర్శిస్తున్నారు.