అమ్మ బాబోయ్.. కృతి శెట్టికి ప్రేమపై ఇలాంటి ఓపీనియన్ ఉందా..? మహా ముద్దురు పిల్లే..!

ట్రెడిషనల్ బ్యూటీ కృతి శెట్టి పేరుకు ప్రత్యేకమైన పరిచ‌యం అవసరం లేదు. ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఉప్పెనలా దూసుకుపోతోంది. ఆమె నటించిన మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో వరుస సినిమాల‌తో దూసుకుపోతుంది. అయితే కృతి నటించిన మొదటి మూడు సినిమాలు సూపర్ హిట్ కాగా ఆ తరువాత నటించిన అన్ని సినిమాలు ఫ్లాప్. దీంతో కృతికి ఉన్న క్రేజ్ కొద్దిగా తగ్గింది. ఆమెను ఇప్పుడు అంద‌రూ టాలీవుడ్‌లో ఐరెన్‌లెగ్ అంటున్నారు.

Pin on photo s

ఇటీవల కృతి హీరోయిన్ గా నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన కస్టడీ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అందరి హీరోయిన్ల‌లా కాకుండా హాట్ ఫోటోషూట్లకు దూరంగా ఉంటుంది కృతి. ఇటీవల రిలీజ్ అయిన కస్టడీ సినిమాలో కృతి శెట్టిని ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు చాలా ఆసక్తికరమైన సమాధానం చెబుతూ వచ్చింది కృతి.

Krithi Shetty Hot Looks in Saree Goes Viral | സാരിയിൽ ഇത്ര ഹോട്ടോ, കൃതി  ഷെട്ടിയുടെ ചിത്രങ്ങൾ| News in Malayalam

అదే క్రమంలో మీరు ఎవరినైనా ప్రేమించారా ? అని యాంకర్ కృతిని అడగగా నేను సినిమాలతో మాత్రమే ప్రేమలో ఉన్నాను.. డేటింగ్ చేస్తున్నాను. ఇప్పటివరకు మా అమ్మ నాన్నలను తప్ప నేను ఎవరిని ప్రేమించలేదు… ప్రేమ అనేది చాలా స్వచ్ఛంగా ఉండాలి.. నాకు ఇప్పటివరకు అంత స్వచ్ఛంగా ప్రేమ దొరికింద‌ని తెలిపింది. నేను మా అమ్మ నాన్నను తప్ప ఇప్పటివరకు ఎవరిని ప్రేమించే అవకాశం రాలేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది.

Krithi Shetty Looking Fabulous in Orange Saree | Telugu Rajyam Photos

అయితే నా స్కూలింగ్, కాలేజ్ టైంలో చాలా లవ్ లెటర్స్ వచ్చాయి.. వాటిని నేను పట్టించుకునే దాన్ని కాదంటూ సమాధానం ఇచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చాలామంది నెటిజన్లు కృతి శెట్టి ఒపీనియన్ చాలా మంచిదంటు.. మరి కొంతమంది ఇంత చిన్న వయసులోనే ప్రేమ గురించి అంత‌గా మాట్లాడిందంటే కృతి మహాముదురు పిల్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.