ప్ర‌భాస్ ‘ ఆదిపురుష్ ‘ తెలుగు టార్గెట్ ఎన్ని కోట్లో చూస్తే క‌ళ్లు తిర‌గాల్సిందే…!

కృష్ణంరాజు నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లేవ‌ల్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. కాగా ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా తర్వాత వచ్చిన రాధేశ్యామ్, సాహో సినిమాలో డిజాస్టర్ గా నిలిచాయి. అయితే ఈ రెండు డిజాస్టర్ ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆది పురుషు పైనే ప్రభాస్ ఆశలు పెట్టుకున్నాడు. ఇటీవల ఆది పురుష సినిమా నుంచి ట్రైలర్ రిలీజై ప్రేక్షకుల్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

Adipurush New Poster Alert: Prabhas Fans Going Berserk

ఈ సినిమాలో రాఘవ పాత్రలో ప్రభాస్ ను చూసిన ప్రేక్షకులు ప్రభాస్ పై ప్ర‌సంస‌ల వ‌ర్షంకురిపిస్తున్నారు. ఆదిపురుష్ తెలుగు వర్షన్ కే కాక హిందీ వర్షన్ లో కూడా రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. దీన్ని బట్టి ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలుస్తుంది. అయితే యువీ క్రియేషన్స్ లో తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగులో విడుదల చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల టార్గెట్ ఎన్ని కోట్లో చూస్తే క‌ళ్లు తిర‌గాల్సిందే.. ఆదిపురుష్‌ తెలుగు రాష్ట్రాల టార్గెట్ రు. 150 కోట్లని వార్తలు వినిపిస్తున్నాయి. మైథాలజికల్స్ స్టోరీలకు ఈ రేంజ్ అంటే కష్టమైన విషయమే. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా టాక్ బట్టి కలెక్షన్స్ వస్తాయి. రు. 700 కోట్ల భారీ బడ్జెట్లో ఆది పురుష సినిమా తెర‌కెక్కింది.

Adipurush New Poster Alert: Prabhas Fans Going Berserk

ప్రభాస్ ప్రస్తుత ఆదిపురుష్‌ సినిమానే కాక ప్రాజెక్ట్ కే , సలార్ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఈ మూడు సినిమాల్లో బడ్జెట్ రు. 1500 కోట్లు కాగా ఈ సినిమాలు రిలీజ్ అయి వచ్చిన కలెక్షన్లు బట్టే ప్రభాస్ మార్కెట్ ఉంటుందని సినీశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఆదిపురుష్ తో పాటు ప్రాజెక్ట్ కే , సలార్ సినిమాలు కూడా రిలీజై ఊహించిన రేంజ్ లో రికార్డ్ కలెక్షన్లు సాధించాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.