పవిత్రా లోకేష్ ఆత్మహత్య ఆలోచ‌న‌కు అస‌లు కార‌ణం ఇదా… తెర‌వెన‌క ఇంత జ‌రిగిందా…!

ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషన్ ఎవరంటే అందరికీ గుర్తొచ్చే పేర్లు సీనియర్ హీరో నరేష్- పవిత్ర లోకేష్ జంట. సమ్మోహనం సినిమాలో భార్యాభర్తలు గా కలిసి నటించిన ఈ జంట అప్ప‌టినుంచి వీరి మధ్య మంచి స్నేహం మొదలైంది. ఆ తర్వాత వీరిద్దరూ డేటింగ్ లో మునిగిపోయారు. అధికారికంగా వీరిద్దరికి పెళ్లి జరిగిందా లేదా అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు.. కానీ వీరిద్దరూ అందరికీ భార్యాభర్తల్లాగా కనిపిస్తున్నారు.

Naresh and Pavitra Lokesh share a passionate kiss in wedding announcement  video. Watch - India Today

తన మొదటి భ‌ర్త‌కు దూరమైన పవిత్ర తన నివాసాన్ని కూడా హైదరాబాద్‌కు మార్చేసింది. నరేష్ తో కలిసి ఆమె నటించిన మళ్లీ పెళ్లి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా వీరు నిజ జీవితంలో జరిగిన సంఘటనల‌ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ సినిమా యూనిట్ ప్ర‌మోషన్లలో బిజీగా ఉంది.

ఈ క్రమంలోనే నరేష్- పవిత్ర కలిసి పాల్గొన్న ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పవిత్ర చెప్పుకొచ్చింది. నరేష్ తన జీవితంలోకి వచ్చాక జరిగిన ముఖ్యమైన మార్పుల గురించి మాట్లాడింది. ఒక దశలో తాను ఆత్మహత్య చేసుకోవాలని కూడా చూశానని.. అలాంటి తన ఆలోచనలను పూర్తిగా మార్చి.. మళ్లీ సంతోషంగా జీవించేలా చేసింది నరేషే అని ఆమె వెల్లడించింది. ‘‘నరేష్ ఎంత సీరియస్ విషయమైనా తేలిగ్గా తీసుకుంటారు. దాన్నుంచి బయటపడేందుకు సీరియస్‌గా ఆలోచిస్తారు.

Pavitra Loves Luxury Life, Will Do Anything For It': Ex-Husband Suchendra  Prasad

ఆ లక్షణం తనలో లేదని వెల్లడించారు. ‘నేను చిన్న చిన్న విషయాలని కూడా సీరియస్‌గా తీసుకుంటాను. నరేష్‌కు, నాకు మధ్య బంధాన్ని ఆయన కుటుంబం అంగీకరించింది. మా విషయంలో కొన్ని సంఘటనలు జరిగాయి. నా విషయానికే వస్తే.. కొందరు పరిస్థితులని అడ్డుపెట్టుకొని నన్ను చాలా తప్పుగా చూపించారు. నా వ్యక్తిత్వం హననం చేసి, నా కెరీర్‌పై బ్లాక్ మార్క్ పెట్టాలని చూశార‌ని చెప్పింది.

ఇక దీని నుంచి బయటికి రావడం చాలా కష్టం. నేను ఒంటరిగా ఉంటే ఆత్మహత్య చేసుకోవాలి లేదంటే ఇంట్లో కూర్చోవాలి. నేను బయటికివచ్చానంటే కారణం నరేష్.. నా వెనుక బలంగా నిలబడ్డారు. నేను ఉన్నానని చెప్పారు. దేనికీ భయపడలేదు. నేను ఒక్క అడుగు వెనక్కి వేసినా పరిస్థితి దారుణంగా ఉండేది. నరేష్ చాలా సపోర్ట్‌గా ఉన్నారు’ అని ప‌విత్ర‌ చెప్పుకొచ్చింది.