మాజీ మొగుడికి మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చిన రమ్యా రఘుపతి..నరేష్ పరువు మొత్తం గంగలో కలిసిపోయే..!

నరేష్, పవిత్ర లోకేష్.. లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. టీజర్, ట్రైలర్ సినిమా పై ఆసక్తిని కలిగించాయి. ట్రైలర్ చూసిన వాళ్లంతా ఇది వాళ్ళ బయోపిక్ అని ముచ్చటించుకుంటున్నారు. నరేష్, పవిత్ర కలిసి జీవిస్తుండడం.. అలాగే ఇంకో పెళ్లి చేసుకోవాలి అనుకోవడం, మధ్యలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి అడ్డుపడటం వంటి వ్యవహారాలు వార్తలకెక్కడం అందరూ చూశారు.ఒకానొక టైంలో వీళ్ళు మైసూర్ లోని హోటల్ గదిలో ఉన్నప్పుడు రమ్య మీడియాని వెంటేసుకుని వెళ్లి పెద్ద రచ్చే చేసింది.

Malli Pelli Movie | Naresh-Pavitra Lokesh's Wedding Moment Fix-Namasthe  Telangana

 

ఆ విజువల్స్ అన్నీ పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అవన్నీ ‘మళ్ళీ పెళ్లి’ ట్రైలర్ లో కనిపించాయి. రమ్య రఘుపతి పై పగ తీర్చుకోవడానికి నరేష్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు అనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. యం.యస్.రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఏది ఏమైనా ‘మళ్ళీ పెళ్లి’ సినిమా పై జనాల ఫోకస్ అయితే గట్టిగానే ఉంది. స‌రిగ్గా సినిమా విడుద‌ల‌కు కొన్ని గంట‌ల ముందు ర‌మ్య ర‌ఘుప‌తి భారీ షాక్ ఇచ్చింది.

Who Is Actor Naresh Wife Ramya Raghupathi? Biography, Age, Education,  Marriage, Instagram

 

త‌న ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించేలా సినిమాను చిత్రీక‌రించార‌ని, కావున విడుదలను ఆపాలంటూ కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో ర‌మ్య ర‌ఘుప‌తి పిటిషన్ వేశారు. దీంతో ఫ్యామిలీ కోర్టు నిర్ణ‌యంపై ఉత్కంఠ నెల‌కుంది. ఈ సినిమాలో తన ప్రతిష్టను కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారని ఈమె ఆరోపణలు చేస్తూ ఈ సినిమా విడుదల ఆపివేయాలని కోర్టును కోరారు.మరి రమ్య రఘుపతి ఫిర్యాదు పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.