ఎన్టీఆర్ కెరీర్‌లో అతి పెద్ద మిస్టేక్‌… ఓ భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ మిస్ అయ్యాడుగా…!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాల‌లో న‌టించాడు. గ‌త ఆరు సినిమాల‌తో ఎన్టీఆర్‌కు ప్లాప్ లేదు. టెంప‌ర్‌తో మొద‌లు పెడితే త్రిబుల్ ఆర్ వ‌ర‌కు వ‌రుస‌గా అన్నీ హిట్లే..! అయితే ఎన్టీఆర్‌కు టెంప‌ర్‌కు ముందు వ‌ర‌కు వ‌రుస ప్లాపులు ప‌డ్డాయి. రామ‌య్యా వ‌స్తావ‌య్యా, ర‌భ‌స‌, అంత‌కు ముందు శ‌క్తి, ఊస‌ర‌వెల్లి అన్నీ ప్లాపులే.. మ‌ధ్య‌లో బృందావ‌నం మాత్ర‌మే య‌బో యావ‌రేజ్‌.

Kick Telugu Full Movie Online in HD Quality on aha

ఎన్టీఆర్ కెరీర్ య‌మ‌దొంగ త‌ర్వాత కూడా డ‌ల్ అయ్యింది. ఆ టైంలో సురేంద‌ర్‌రెడ్డి కిక్ సినిమా స్టోరీని ఎన్టీఆర్‌కు వినిపించాడు. సురేంద‌ర్‌రెడ్డి ఫ‌స్ట్ సినిమా అత‌నొక్క‌డే. క‌ళ్యాణ్‌రామ్ నిర్మాత‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. అందుకే సురేంద‌ర్‌రెడ్డి కిక్ స్టోరీ రెడీ చేసుకుని ముందుగా ఎన్టీఆర్‌కే చెప్పాడు. అయితే అప్పటికే వ‌రుస‌గా స్టార్ డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు చేస్తున్నా వ‌రుస ప్లాపులు వ‌స్తుండ‌డంతో ఎందుకో ఎన్టీఆర్‌కు ఈ స్టోరీ క‌నెక్ట్ కాలేదు. సురేంద‌ర్‌రెడ్డికి అప్ప‌టికే అశోక్ సినిమాతో ఛాన్స్ ఇచ్చినా క్లిక్ కాలేదు.

Oosaravelli Review | BollyReview

అందుకే మ‌ళ్లీ సురేంద‌ర్‌రెడ్డితో ట్రావెల్ చేసేందుకు ఎన్టీఆర్ ఇష్ట‌ప‌డ‌లేదు. ఆ త‌ర్వాత సురేంద‌ర్‌రెడ్డి ఇదే స్టోరీని రెబల్ స్టార్ ప్రభాస్ కి వినిపించగా ఆయన కూడా నో చెప్పాడు. దీంతో సురేందర్ రెడ్డి చివ‌ర‌కు ర‌వితేజ‌కు చెప్ప‌గా మ‌నోడు ఓకే చేశాడు. ఇక హీరోయిన్‌గా ఇలియానాను తీసుకున్నారు. అప్ప‌టికే ఇలియానా, ర‌వితేకు జోడీగా ఖ‌త‌ర్నాక్ చేసింది. ఇక ర‌వితేజ‌కు ధీటైన పోలీస్ క్యారెక్ట‌ర్‌కు ముందుగా జ‌గ‌ప‌తిబాబును అనుకున్నారు.

Brindavanam (2010 film) - Wikipedia

ఆ త‌ర్వాత ఓ త‌మిళ మ్యాగ‌జైన్‌లో శ్యామ్ స్టిల్ చూసి సురేంద‌ర్‌రెడ్డి అత‌డికి స్టోరీ చెప్పి ఒప్పించారు. అలా కిక్ సినిమా తెర‌కెక్కింది. 2009 మే 8న రవితేజ కెరీర్ లోనే భారీ స్థాయిలో రిలీజ్ అయిన్ కిక్ తొలి ఆట నుంచే బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. ఆ రోజుల్లో ఈ సినిమాకు రు. 14 కోట్ల ఖ‌ర్చ‌య్యింది. ఆ త‌ర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా 2015లో కిక్ 2 వ‌చ్చినా ఆక‌ట్టుకోలేదు. ఇక ఎన్టీఆర్ కిక్ సినిమా చేసి ఉంటే క‌రెక్టు టైంలో మంచి హిట్ కొట్టి ఉండేవాడు. ఇక ప్ర‌స్తుతం ఎన్టీఆర్ కొర‌టాలతో దేవ‌ర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత కూడా వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో దూసుకుపోతున్నాడు.