మ‌హేష్‌తో కాపురం చేసేందుకు న‌మ్ర‌త పెట్టిన సింగిల్ కండీష‌న్ ఇదే…!

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాజీ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ జంట ఒకటి. ఒకప్పుడు మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న నమ్రత.. ఆ తర్వాత మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ లో హీరోయిన్ అయింది. ఇక బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన వంశీ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా నటించిన నమ్రత… ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంజి సినిమాలోని మెగాస్టార్ చిరంజీవికి జోడిగా కనిపించింది.

Mahesh Babu's wife Namrata Shirodkar REVEALS it was love at first sight for  her; says, 'You don't find men like that' | Bollywood Life

వంశీ సినిమా టైంలో మహేష్ బాబుతో ప్రేమలో పడిపోయిన నమ్రత ఐదేళ్ల ప్రేమ తర్వాత 2005లో పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలు అయ్యింది. ఒకటి మాత్రం నిజం. నమ్ర‌త‌ను పెళ్లి చేసుకున్నాక మహేష్ బాబు కెరీర్ లో వ్యక్తిగతంగాను, కెరీర్ పరంగాను చాలా మార్పులు వచ్చాయి. మహేష్ ను నమ్రత చాలా మార్చేసింది అని కూడా అంటారు. అలాగే మహేష్ కెరీర్‌కు నమ్రత తెర వెనక అన్ని తానై నడిపిస్తూ ఒక వెన్నుదన్నుగా ఉంటోంద‌న్నది కూడా నిజం.

ఇక పెళ్లికి ముందే అన్ని షూటింగులు పూర్తి చేయడానికి మహేష్ బాబు కోసం తాను రెండేళ్లకు పైగా ఎదురు చూశానని కూడా నమ్రత తన గ‌తంలో జ‌రిగిన ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. అలాగే మహేష్ తో పెళ్లికి ముందు కూడా తాను ఓ కండిషన్ పెట్టానని… తాను ముంబైలో పెరిగినందున పెద్ద ఇంట్లో నివసించటం సౌకర్యంగా లేదని చెప్పడంతో మహేష్ తన కోసమే అపార్ట్మెంట్లోకి మారాడ‌ని కూడా నమ్రత చెప్పింది.

Namrata Shirodkar not part of Mahesh Babu's next | The News Minute

ఇక నటన నుంచి తప్పుకున్నందుకు తనకు ఎలాంటి బాధ లేదని చెప్పిన నమ్రత… తన తల్లి కోరిక మేరకే తాను మోడలింగ్ ప్రారంభించామని చెప్పింది. ఇలా నమ్రత కోసం మహేష్ ఏ పని చేయడానికి అయినా సిద్ధమయ్యాడు.