ఈ స్టార్ హీరోల భార్యల బిజినెస్‌లు… ఆదాయం చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాకే…!

టాలీవుడ్ లో ఉన్న ఒక్కొక్క స్టార్ హీరో కోట్ల రూపాయల్లో రెమ్యూనరేషన్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా వ్యాప్తంగా తెలుగు సినిమాల హవా నడుస్తుంది. దీంతో ఒక్కో స్టార్ హీరో తమ సినిమాలకు రూ.50 నుంచి రూ.100 కోట్ల మేర‌ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. అయితే చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలే కాకుండా వారి భార్యలు కూడా అదే రేంజ్ లో భారీగా సంపాదిస్తున్నారని విషయం చాలా మందికి తెలియదు. తెలుగు చిత్ర పరిశ్రమలో వ్యాపారాలు చేస్తూ స్టార్ హీరోలు అధికంగా సంపాదిస్తున్న స్టార్ హీరోల భార్యలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Allu Arjun's romantic selfie with his wife Sneha Reddy from New York goes  viral | Telugu Movie News - Times of India

స్నేహారెడ్డి :
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూడా వ్యాపారాలు చూసుకుంటున్నార‌న్న సంగతి చాలా మందికి తెలియదు. అల్లు అర్జున్ సతీమణి తన తండ్రి ప్ర‌భాక‌ర్ రెడ్డి స్థాపించిన సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా స్నేహారెడ్డి ఓ ప్రముఖ మ్యాగజైన్ కు ఎడిటర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Ram Charan-Upasana escape to Africa to celebrate their seventh wedding  anniversary | Events Movie News - Times of India

ఉపాస‌న కొణిదెల :
రామ్ చరణ్ సతీమణి ఉపాసన బిజినెస్ లో ఫుల్ బిజీగా ఉంటారు అన్న సంగతి చాలామందికి తెలుసు. ఉపాసన అపోలో హాస్పిటల్స్ వ్యాపారంలో తనదైన పాత్రను పోషిస్తున్నారు. కోట్లాది రూపాయ‌ల అపోలో హాస్ప‌ట‌ల్స్ వ్యాపారాన్ని ముందుకు న‌డిపించ‌డంలో ఆమె కీ రోల్ పోషిస్తున్నారు. అంతేకాకుండా యూట్యూబ్ ద్వారా సెలబ్రిటీలతో ఆరోగ్యకరమైన వంటకాలను వండిస్తు వాటిని ప్రజలకు పరిచయం చేస్తున్నారు.

Chinmayi and Rahul Ravindran blessed with twin babies, Driptah and Shravas.  See pics - India Today

సింగ‌ర్ చిన్మ‌యి :
అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయమైన రాహుల్ రవీంద్రన్ భార్య సింగర్ చిన్మయి కూడా వ్యాపారాలు చేస్తుంది. ఓ ఇంటర్వ్యూలో తన భార్య తనకంటే ఎక్కువ ఇన్కమ్ టాక్స్ ఫైల్ చేస్తుందని రాహుల్ రవీంద్రన్ తెలిపారు.

Nandamuri Kalyan Ram's Naa Nuvve Look Impressed His Family | klapboardpost

నంద‌మూరి స్వాతి :
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ భార్య కూడా వ్యాపార రంగంలో రాణిస్తుంది. ఎంబీబీఎస్ చదివిన కళ్యాణ్ రామ్ సతీమణి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ వీఎఫ్ఎక్స్ కంపెనీని నడుపుతున్నారు. క‌ళ్యాణ్‌రామ్ సినిమాల వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ అంతా ఈ కంపెనీల్లోనే జ‌రుగుతుంది.

Who is Viranica Manchu? Wiki, Biography & Facts About Manchu Vishnu's Wife

మంచు వెరోనికా రెడ్డి :
మంచు విష్ణు సతీమణి వెరోనిక కూడా పలు వ్యాపారాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఓ క్లాతింగ్ కంపెనీకి ఆమె ఓనర్ గా ఉన్నారు. కుటుంబ ప‌రంగా ఉన్న వ్యాపారాలు కూడా ఆమె చూసుకుంటున్నారు. అంతేకాకుండా మోహన్ బాబు హీరోగా నటించిన సన్నాఫ్ ఇండియా సినిమాకు వెరోనిక డిజైనర్ గా పనిచేశారు.