అప్పుడు తండ్రి..ఇప్పుడు కొడుకు.. నందమూరి అభిమానులకు ఇంతకంటే ఏం కావాలి బ్రదర్స్..!!

అభిమానుల కోసం ఎలాంటి స్టెప్ అయినా తీసుకోవడంలో ముందు ఉంటాడు నందమూరి నట సింహం బాలయ్య . ఈ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఆయన నటించిన సినిమాలలో అభిమానుల కోసం తాను ఎంతో కష్టపడినా సందర్భాలు ఉన్నాయి . కాగా రీసెంట్ గానే “వీర సింహారెడ్డి” సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ.. ప్రెసెంట్ ఎన్బికె 108 షూటింగ్లో బిజీగా ఉన్నాడు . అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటిస్తుంది.

When Balakrishna differed with his legendary father | cinejosh.com

శ్రీ లీల మరో పాత్రలో మెరవనుంది. అంతేకాదు ఈ సినిమాలో శ్రియ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించబోతుంది అంటూ ఓ టాక్ వైరల్ గా మారింది . కాగా ఈ క్రమంలోని జూన్ 10న నందమూరి బాలయ్య పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ , టైటిల్ ని రివిల్ చేయనున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ఇదే రోజున బాలయ్య బోయపాటి డైరెక్షన్లో రాబోతున్న అఖండ 2 సినిమాపై కూడా కీలక అప్డేట్ ఇవ్వనట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

Nandamuri Balakrishna's Son Mokshagna To Make His Tollywood Debut In 2023 - Filmibeat

అంతేకాదు అఖండ 2 సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఉండబోతుంది అంటూ ఒక క్రేజీ టాక్ వైరల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో సొంత తండ్రి సినిమాలతోనే వారసులు ఎంట్రీ ఇస్తున్నారు ..అదే స్ట్రాటజీ ని ఫాలో అవుతున్నాడు బాలయ్య . కొడుకు మోక్షజ్ఞను తన సినిమా ద్వారానే ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకుంటున్నారట. బోయపాటి కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తుంది . తండ్రి లక్కీ డైరెక్టర్ సమక్షంలో డైరెక్షన్లో కొడుకు ఎంట్రీ ఉంటే అంతకన్నా ఇంకేం కావాలి అంటున్నారు నందమూరి అభిమానులు. దీంతో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్..!!

Mokshagna's Debut Back In News