వామ్మో.. నాగార్జున లో ఈ యాంగిల్ కూడా ఉందా..? మహా గట్టోడే… !

నాగార్జున.. అక్కినేని నాగేశ్వరావు నట వారసుడుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన చాలా సినిమాలు హిట్స్ కాగా కొన్ని సినిమాలు ఫ్లాప్స్ గా నిలిచాయి. సినిమాల్లోనే కాక‌ బిజినెస్ రంగంలోని దూసుకుపోతున్న నాగ్‌లో మ‌రో యాంగిల్ కూడా ఉంది. సినిమా హీరోలే కాకుండా దర్శకులు కూడా హిట్ ఉన్నప్పుడు మాత్రమే అంద‌రికి గుర్తుంటారు. ఒకసారి ఫ్లాప్ పడిందంటే సినిమాలు తీయడానికి హీరోలు, ప్రొడ్యూసర్స్ కూడా వారికి ఛాన్స్ ఇవ్వరు.

Nenunnanu (2004) - IMDb

నాగార్జున మాత్రం అందరు హీరోల్లా కాకుండా ఒకసారి అతనికి హిట్ ఇచ్చిన డైరెక్టర్ అయితే తర్వాత అతడి డైరెక్షన్లో ఫ్లాప్ సినిమాలు వచ్చినా.. అత‌డి మీద నమ్మకంతో మరొక ఛాన్స్ ఇస్తాడు. కేవలం ఇలాంటి మనస్తత్వం నాగార్జునకు మాత్రమే ఉంటుంది. నాగార్జున నేనున్నాను సినిమాతో మంచి హిట్ కొట్టారు. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్, శ్రియ నటించారు. వి ఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది.

Boss (2006) - IMDb

తర్వాత నాగార్జున ఆదిత్య దర్శకత్వంలో మరొక సినిమా రావాల్సి ఉండగా కొన్ని కారణాల‌తో ఆ సినిమా పోస్ట్ ఫోన్ అయింది. తర్వాత ఆదిత్య దర్శకత్వంలో మనసు మాట వినదు అనే సినిమా రిలీజై డిజాస్టర్ గా నిలిచింది. ఇక అదిత్య‌ దర్శకత్వంలో నాగార్జున సినిమా రావడం అనేది జరగదేమో అని చాలామంది అనుకున్నారు. నాగార్జున ఎవరు ఊహించని విధంగా అదిత్యకి అవకాశం ఇచ్చాడు. అదే నాగార్జున, నయనతార జంట‌గా నటించిన బాస్. ఈ సినిమా యావరేజ్ గా నడిచింది.

 

అప్పటికే మనసు మాట వినదు అనే సినిమా ద్వారా ఫ్లాప్ అందుకున్న ఆదిత్యని నాగార్జున అంతగా నమ్మడానికి గల కారణం ఏంటంటే.. అంతకు ముందు ఆదిత్యతో కలిసి సెట్లో పాల్గొన్నప్పుడు అతను ఎలా సినిమాలు తీస్తాడు.. అనే విషయాన్ని గమనించిన నాగార్జున అతడిపై నమ్మకంతోనే మరొక ఛాన్స్ ఇచ్చారట.

బాస్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. నాగార్జున అప్పుడే శ్రీరామదాసు సినిమాలో నటించి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అలాంటి క్లాసికల్ సినిమాలో నటించిన నాగార్జునని జనాలు తర్వాత ఏ క్యారెక్టర్ లో నటించినా త్వరగా యాక్సెప్ట్ చేయలేరు. అందుకే ఈ సినిమా అప్పట్లో రిలీజై యావ‌రేజ్ గా నిలిచిందంటారు చాలా మంది సిని విశ్లేష‌కులు.