మెగా ఫ్యామిలీలో ఒకేసారి అన్నాచెల్లి పెళ్లి.. ఇదే అదిరిపోయే ట్విస్ట్ మ‌రి..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త ఎంతో వైరల్ గా మారింది. మెగా కుటుంబంలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గ‌త 24 గంటల నుంచి మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని, వచ్చే నెలలో ఎంగేజ్మెంట్ అంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటి నుంచో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

TRENDING: Lavanya Tripathi and Varun Tej to get married? The former  clarifies! | JFW Just for women

ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలా.. నాగబాబు కూడా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి గురించి అనౌన్స్మెంట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఈ విషయం ఇలా ఉంచితే తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయం ఏమిటంటే నిహారిక ఇప్పటికే తన భర్త జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌తో విడిగా ఉంటుందని.. అంతేకాకుండా విడాకులు తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

నాగబాబు తన కొడుకు కూతురు వివాహాలను రెండూ ఒకేసారి చేయాలని నిర్ణయించుకున్నారట. ఇక తన కొడుకు భార్యగా లావణ్య త్రిపాఠి అని ఫిక్స్ అయిపోయార‌ట‌. ఇక తన కూతురికి మ‌ళ్లీ పెళ్లి చేసే ఆలోచ‌న‌లో కూడా నాగ‌బాబు ఉన్నాడ‌ట‌. టాలీవుడ్ ఇన్న‌ర్‌గా న‌డుస్తోన్న గాసిప్‌ల ప్ర‌కారం నిహారిక తన బావ సాయిధరమ్ తేజ్‌ను రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అస‌లు గతం నుంచే వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ ఉంద‌ని.. కొన్ని కార‌ణాల వల్ల అది సెట్ కాలేద‌నే టాక్ గ‌తంలో వ‌చ్చింది.

Naga Babu Responds On The Rumors About Sai Dharam Tej And Niharika - Telugu  Bullet

అలాగే రీసెంట్‌గా నిహారిక చేసిన వెబ్ సిరీస్ కు స్పెషల్ గెస్ట్ గా కూడా సాయిధరమ్ తేజ్ వస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఎలాగూ వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు అటు కొడుకుతో పాటు ఇటు కూతురికి ఒకేసారి వివాహం చేయాలని నాగబాబు భావిస్తున్నారట. ఇందులో ఎంతవరకు నిజమందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయం ఏమిటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.