షూటింగ్ స్పాట్‌లోనే ఆ స్టార్ హీరోయిన్‌ని చెప్పుతో కొట్టిన జ‌య‌సుధ‌…!

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది జయసుధ. మొదటి తరం హీరోలైన‌ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నుంచి మూడో తరం హీరోలైన చిరంజీవి వరకు దాదాపు అందరి స్టార్ హీరోల‌ సరసన నటించింది జయసుధ. తర్వాత కొత్త హీరోయిన్లు రావడంతో జ‌యసుధ క్రేజ్ కాస్త తగ్గింది. దీంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న జయసుధ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది.

Katakataala Rudraiah - Alchetron, The Free Social Encyclopedia

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. నిన్న మొన్నటి వరకు స్టార్ హీరో, హీరోయిన్ల‌కు తల్లిగా నటించిన‌ జయసుధ. ఇప్పుడు తన వయస్సుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ నటిస్తుంది. జయసుధ ఒక సందర్భంలో షూటింగ్ స్పాట్ లోనే తన తోటి స్టార్ హీరోయిన్ ను చెప్పుతో కొట్టిందట. ఇంతకీ ఎవరా హీరోయిన్..? అసలు ఏం జరిగింది తెలుసుకుందాం.

Jayasudha :ఆ స్టార్ హీరోయిన్ ని చెప్పుతో కొట్టిన జయసుధ.. కారణం..? - PakkaFilmy

జయసుధ, కృష్ణంరాజు హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన కటకటాల రుద్రయ్య సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఆ సినిమాలో మరో హీరోయిన్ గా జ‌య‌చిత్ర నటించింది. ఈ సినిమాలో కోపంతో ఒకరినొకరు కొట్టుకోవాలి.. కాగా జ‌య‌చిత్రకు, జ‌య‌సుధ‌కు అంత‌కు ముందే కాస్ట్యూమ్స్‌ విషయంలో ఏదో గొడవ జరిగిందట.. ఇక గొడవ కాస్త పెద్దదవడంతో జ‌య‌చిత్ర… జ‌య‌సుధ‌తో ఆ చెప్పులు విప్పేసి రా అని మొహం మీద చెప్పిందట.

బీచ్ లో జుట్లు పీక్కున్నా తెలుగు స్టార్ హీరోయిన్స్.. మాములు రచ్చ కాదు | fight between jayasudha and jayachitra , jayasudha, jayachitra , Katakatala Rudrayya , Director Dasari, krishnamraju ...

జ‌య‌సుధ అందుకు ఒప్పుకోలేద‌ట‌. నాకు ఇచ్చిన కాస్ట్యూమ్స్‌, చెప్పులు నేను ఎందుకు ? వాడ‌కూడ‌ద‌ని నేరుగానే ప్ర‌శ్నించింద‌ట‌. ఆ త‌ర్వాత వారిద్ద‌రు కొట్టుకునే సీన్‌లో ముందుగా జ‌య‌చిత్ర జ‌య‌సుధ‌ను కావాల‌నే గ‌ట్టిగా కొట్టింద‌ట‌. దాంతో జయసుధ కోపంతో ఆమెను షూటింగ్లోనే చెప్పుతో గట్టిగా కొట్టిందట‌. ఇలా వారిద్దరూ నిజంగానే కొట్టుకుంటుండ‌గా ప‌క్క‌నే ఉన్న వారు వారిని విడ‌దీశారు. అయితే వారు నిజంగా కొట్టుకోవ‌డంతో ఆ సన్నివేశం చాలా బాగా పండింద‌ట‌.