వెంక‌టేష్ ఈ త‌ప్పులు చేయ‌క‌పోతే టాలీవుడ్ నెంబ‌ర్ 1 హీరో అయ్యేవాడా… ఆ త‌ప్పులు ఇవే…!

విక్టరీ వెంకటేష్ ప్రముఖ టాలీవుడ్ లెజెండ్రీ నిర్మాత రామానాయుడు కొడుకుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన నటించిన తెలుగు సినిమాల్లో చంటి, కలిసుందాం రా, సుందరకాండ, బొబ్బిలి రాజు, ప్రేమించుకుందాం రా, పవిత్ర బంధం, సూర్యవంశం లాంటి ఎన్నో సినిమాలు ఆయ‌న‌కు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఆయన చేసిన చాలా సినిమాలు కుటుంబ నేపథ్యంలో వచ్చినవే. అలాంటి వెంకటేష్ తన కెరియర్ లో చాలా సినిమాలను రిజెక్ట్ చేశాడు.

Actress Sexy Photos, Movie Stills, Image Gallery, Hot Boob Show, Aunty  Pics: Gharshana Old Telugu Movie Mp3 Songs Free Download

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఘర్షణ సినిమాలో మొదటిగా వెంకటేష్, నాగార్జునను హీరోలుగా అనుకున్నాడట మణిరత్నం. ఏవో కారణాల చేత వీరిద్దరూ ఆ సినిమాను రిజెక్ట్ చేయడంతో తమిళ్ హీరోలుగా ఉన్న ప్రభు, కార్తీక్ తో ఈ సినిమాను తీసి సూపర్ హిట్ సాధించాడు. తర్వాత మళ్లీ మణిరత్నం దర్శకత్వంలోనే వచ్చిన రోజా సినిమాలో కూడా మొదటగా వెంకటేష్ ను హీరోగా అనుకుంటే ఆ టైంలో చంటి సినిమా షూటింగ్లో ఉన్న వెంకటేష్ ఈ సినిమాను కూడా రిజెక్ట్ చేయడంతో అరవింద్ స్వామితో చేశారు.

Telugu Songsdunia: Santosham (2002) Nagarajuna Telugu Movie Mp3 Songs Free  Download

కమల్ హాసన్ భారతీయుడు సినిమాను కూడా ముందుగా రాజశేఖర్ తండ్రి పాత్రలో వెంకటేష్ కొడుకు పాత్రలో పెట్టాలనుకున్నాడట శంకర్. ఆ త‌ర్వాత క‌మ‌ల్‌హాస‌న్‌తోనే ఈ సినిమా తీయ‌గా బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యింది. అర్జున్ హీరోగా వచ్చిన ఒకే ఒక్కడు సినిమాలో కూడా ముందుగా వెంకటేష్ నే అనుకున్నాడట శంకర్. వెంకీ బిజీ షెడ్యూల్‌తో ఈ సినిమా రిజెక్ట్ చేయ‌గా… అదే కథలో అర్జున్ న‌టించి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

Bharateeyudu: Hariharan, Swarna Latha, Sujatha: Amazon.in: Music}

సంతోషం సినిమాకు డైరెక్ట‌ర్‌ దశరథ్ ముందుగా వెంకటేష్ ను హీరోగా అనుకున్నాడట. అయితే వెంకటేష్ కు ఈ సినిమా కథను వినిపించగా అప్పటికే ఇలాంటి కథలు చాలా సినిమాల్లో ఉండడంతో వెంకటేష్ నో చెప్పాడట. నాగార్జునకి ఈ కథ నచ్చడంతో సూపర్ హిట్ కొట్టాడు. క్రిష్ డైరెక్షన్ లో రానా హీరోగా వచ్చిన కృష్ణంవందే జగద్గురుం సినిమాకు వెంకీ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే టైంకి వదులుకున్నాడట.

Krishnam Vande Jagadgurum (2023) - Movie | Reviews, Cast & Release Date -  BookMyShow

చివరి నిమిషంలో రానా ఈ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గోవిందుడు అందరివాడే సినిమాలో కూడా వెంకటేష్‌ను ఊహించుకొని కథ రాయగా వెంకీ ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో రామ్ చరణ్ సినిమాలో నటించాడు. వెంకీ నిజంగా ఈ సినిమాలు కూడా చేసి ఉంటే టాలీవుడ్‌లో ఖ‌చ్చితంగా నెంబ‌ర్ 1 పొజిష‌న్‌కు వెళ్లిపోయేవాడ‌నే ఆయ‌న అభిమానులు అంటున్నారు.