ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది ఇలియానా . దేవదాసు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ గోవా బ్యూటీ తన అంద చందాలతో అభినయంతో మొదటి సినిమాతోనే యూత్‌కు మత్తెక్కించేసింది. ఆ తర్వాత మహేష్ బాబు పోకిరితో బ్లాక్‌బస్టర్ కొట్టి… వరుస సినిమాలతో దూసుకుపోయింది. మెరుపు తీగ లాంటి నడుముతో అందరిని ఆకర్షించుకున్న ఇలియానా తర్వాత బాలీవుడ్లో సెటిల్ అవుదామనుకున్నా అక్కడ వరుస ప్లాపులతో త్వరగానే ఫేడవుట్ అయ్యింది.
పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయిన ఇలియానా తానే స్వయంగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పోస్ట్ చేసి బేబీకి సంబంధించిన అన్ని విషయాలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే వస్తోంది. అయితే తన కడుపులో పెరుగుతోన్న బిడ్డకు తండ్రి ఎవరు ? అనే విషయంపై చాలా ట్రోల్స్ ఎదుర్కొంటున్నా ఇలియానా ఇంకా ఆ సీక్రెట్ చెప్పట్లేదు. గతంలో సౌత్లో ఎన్నో సినిమాల్లో నటించిన ఇలియానా ఒక స్టార్ హీరో చేతిలో అందరి ముందే చంప దెబ్బతిందట.
ఇల్లూ బేబీ తెలుగు సినిమాల్లో నటిస్తున్న టైంలో షూటింగ్ కి ఎప్పుడు లేటుగా వెళ్ళేది. ఆమె ప్రతిరోజు లేటుగా రావడంతో మూవీ యూనిట్ అంతా ఆమెపై విసిగిపోయారట. అయితే ఆమె తీరు నచ్చని స్టార్ హీరో రోజు ఇలా లేటుగా రావడం మంచిది కాదు అంటూ చెప్పడంతో ఇలియానా నీకేంటి అన్నట్లుగా సమాధానం చెప్పిందంట. దీంతో కోపం వచ్చిన స్టార్ హీరో ఇలియానాను అందరి ముందు చంప మీద లాగిపెట్టి కొట్టాడట.
ఇక అందరి ముందు అలా కొట్టేసరికి ఇలియానా ఇన్సాల్ట్ గా ఫీలై ఆ సెట్స్ నుంచి వెళ్లిపోయిందట. ఆ తర్వాత ఆ సినిమా చేయనని పట్టుబట్టినా… చివరకు డైరెక్టర్, నిర్మాత బతిమిలాడడంతో పాటు మీ వల్ల సినిమా అంతా ఆగిపోయింది.. ఇబ్బందులుతప్పవని చెప్పడంతో అనేక కండీషన్ల మీద ఎలాగోలా ఈ సినిమా పూర్తి చేసింది అట. అప్పట్లో ఈ విషయం టాలీవుడ్‌లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.