మెగాఫ్యామిలీ కోడ‌లిగా లావ‌ణ్య సెట్ అవ్వుద్దా…. పెళ్లే ముచ్చ‌ట కాదు.. సంసారం నిల‌బ‌డాలంటే ఇది త‌ప్ప‌దు మ‌రి…!

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు ఓ రేంజ్‌లో వైర‌ల్‌ అవుతున్నాయి. ఇటీవల వీరిద్దరి పెళ్లిపై అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. జూన్ 9న వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాని.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే క్రమంలో లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోవడానికి వరుణ్ తేజ్, మెగా ఫ్యామిలీ కొన్ని కండీష‌న్లు కూడా పెట్టిందంటున్నారు.

Varun Tej and Lavanya Tripathi Fuel Engagement Speculations

ఈ కండిషన్ల‌కు లావణ్య ఓకే చెప్పాకే వీరిద్దరి వివాహానికి మెగా ఫ్యామిలీ ముహూర్తం ఫిక్స్ చేసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పెళ్ళి ఒక్కటే కాదు.. సంసారం నిలబడాలంటే లావణ్య త్రిపాఠి సినిమాలకు దూరంగా ఉండక త‌ప్ప‌ని ప‌రిస్థితి. మెగా డాట‌ర్ నిహారిక ఒకటి, రెండు సినిమాల్లో నటించి హీరోయిన్‌గా స‌క్సెస్ కాక‌పోయినా.. ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండలేకపోయింది.

Varun Tej and Lavanya Tripathi To Get Engaged on June 9

భ‌ర్త జొన్నలగడ్డ చైతన్య సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని పెట్టిన కండిషన్ ఆమె వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌ను కంట్రోల్ చేసిన‌ట్టుగా ఆమె ఫీల్ అయ్యింది. చాలా తక్కువ సినిమాల్లో నటించి గ్లామర్ షోకు దూరంగా ఉన్న నిహారికనే సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండలేకపోయింది. అంటే ఈ గ్లామ‌ర్ ప్ర‌పంచం మాయ అటువంటిది.Confirmed! Lavanya Tripathi and Varun Tej to get engaged on June 9, wedding  bells soon - India Today

నిహారిక‌తో పోలిస్తే చాలా సినిమాల్లో గ్లామర్ పాత్రల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి ఇకపై సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండగలదా..? మెగా ఫ్యామిలీలో లావణ్య సెట్ అవుతుందా..? అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది మెగా ఫ్యామిలీకి కోడలుగా ఉండాలంటే ఈ కండిషన్లు పాటించక తప్పదు అంటూ కామెంట్ చేస్తున్నారు.