నమ్మించి గొంతుకోసిన స్టార్ ప్రొడ్యూసర్ .. గీతాంజలి హీరోయిన్ జీవితం నాశనం అవ్వడానికి కారణం ఆయనేనా..?

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం గొప్ప విషయం కాదు.. వచ్చిన తర్వాత కూడా ఆ హీరోయిన్స్ స్థానాన్ని పదికాలాలపాటు చెరగనీయకుండా స్టాండర్డ్ గా మెయింటైన్ చేయడమే ఇండస్ట్రీలో ప్రధాన హీరోయిన్ లక్షణం . అయితే అందరి హీరోయిన్ లు అలా ఉంటారా..? కాదని చెప్పాలి. కొందరు హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలు చేసి ఫెడవుట్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి . కాగా అదే లిస్టులోకి వస్తుంది గీతాంజలి హీరోయిన్ గిరిజ .

Geethanjali' (1989)

అక్కినేని నాగార్జున కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన గీతాంజలి సినిమాలో నటించిన ఈ గిరిజ అప్పట్లో ఇండస్ట్రీని ఏలేసింది. ప్రతి ఒక్క హీరో కూడా అమ్మడు నటనకు ఫిదా అయ్యారు . మరీ ముఖ్యంగా గీతాంజలి సినిమాలో వచ్చే డైలాగ్స్ ఇప్పటికీ పాపులారిటీ అవుతున్నాయి అంటే దానికి ప్రధాన కారణం గిరిజ అమాయకత్వం అనే చెప్పాలి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టుగా ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసింది . ఆ తర్వాత మలయాళంలోనూ ఓ సినిమాలో అవకాశం అందుకుంది .

Gitanjali (1989)

కాగా తర్వాత బాలీవుడ్ లో కూడా అవకాశాలు రావడం తో అటువైపుగా అడుగులు వేసిన గిరిజ ఆ తర్వాత బాలీవుడ్ లో బడా డైరెక్టర్ ఆమెను నమ్మించి మోసం చేశాడని ..ఆ కారణంగానే సినీ ఇండస్ట్రీకి దూరమైంది అన్న రూమర్లు బాగా వినిపించాయి . బాలీవుడ్ స్టార్ హీరోతో ఓ సినిమాకి సైన్ చేసిన గిరిజ కి నిర్మాత ముందు సినిమాలో బోల్ సీన్స్ ఉంటాయని చెప్పలేదట.. ఆ తర్వాత షూట్ టైం కి ఆ సీన్స్ చేయమంటూ బలవంతం చేశారట .

When Srinivasan Opens Up An Unknown Story About Vandanam Actress Girija  Shettar - Malayalam Filmibeat

దీంతో అప్పుడు ఆమె కోర్టును కూడా ఆశ్రయించింది అన్న వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్లో అమ్మడుతో ఎవరు సినిమా చేయకూడదు అని నిర్మాతలు డైరెక్టర్లు ఫిక్స్ అయ్యారట . ఈ కోపంలోనే సినిమా ఇండస్ట్రీ అంటే విరక్తి చెందిన గిరిజ ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది అన్న రూమర్లు ఇప్పటికీ వినపడుతున్నాయి . ఒకే ఒక సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ గిరిజ సినిమా ఇండస్ట్రీకి ఇప్పటికి దూరంగానే ఉండడం గమనార్హం..!!