రష్మికతో డేటింగ్‌పై ఫుల్ ఓపెన్ అయిన టాలీవుడ్ హీరో…!

టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అల్లుడు శీను సినిమా ద్వారా అడుగుపెట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ తర్వాత చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. బెల్లంకొండ తెలుగులో నటించిన జయ జానకి నాయక, రాక్షసుడు, సీత, స్పీడున్నోడు కాస్త పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్.. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఛ‌త్రపతి రీమేక్ గా వస్తున్న హిందీ ఛ‌త్రపతి లో హీరోగా.. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు.

What's brewing between Rashmika Mandanna and Bellamkonda Sai Sreenivas? |  Telugu Movie News - Times of India

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ వివి. వినాయ‌క్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. హిందీ రీమేక్ ఛ‌త్రపతి ట్రైలర్ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్ కు రెస్పాన్స్ అదిరిపోవడంతో ఈ సినిమాపై అంచ‌నాలు మరింత పెరిగాయి. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ పైన గట్టిగా దృష్టి పెట్టారు మేకర్స్. సినిమా ప్రమోషన్స్ లో బెల్లంకొండ శ్రీనివాస్ యాక్టివ్ గా పాల్గొంటున్నారు.

Rashmika Mandanna and Bellamkonda Sreenivas were spotted at Mumbai airport

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో బెల్లంకొండ‌కు షాకింగ్ ప్ర‌శ్న ఎదురైంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న‌తో మీరు డేటింగ్ లో ఉన్నార‌న్న ప్ర‌శ్న‌కు బెల్లంకొండ ఆ వార్తను ఖండిస్తూ ఇద్దరుకలిసి మాట్లాడుకుంటే మీకు నచ్చినట్లు పుకార్లు సృష్టించేస్తారా ? అని ప్ర‌శ్నించారు.

Rashmika Mandanna-Vijay Deverakonda part ways, actress dating Bellamkonda  Sreenivas? Here's what sparked rumours - India Today

రష్మిక నేను కేవలం మంచి స్నేహితులం మాత్రమే.. అప్పుడప్పుడు షూటింగ్స్ పరంగా ఎయిర్పోర్టులో కలిస్తే మాట్లాడుకుంటూ ఉంటాం.. అది కూడా చాలా తక్కువ సందర్భాల్లో జరిగింది.. అంటూ వారిద్దరి పై వస్తున్న ఎఫైర్ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాడు బెల్లంకొండ.